తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మరియు కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు మార్గదర్శకత్వంలోను విమానాశ్రయ సౌకర్యాలను పెంపొందించే లక్ష్యంతో, తిరుపతి విమానాశ్రయం నుండి మొదటి అంతర్జాతీయ విమానం సింగపూర్‌కు రేపు ఉదయం బయలు దేరుతుందని శ్రీనివాస రావు మన్నే, విమానాశ్రయ డైరెక్టర్, తిరుపతి వారు ఒక ప్రకటనలో గురువారం తెలిపారు.
విమాన వివరాలు:
– విమానాశ్రయం: తిరుపతి (VOTP)
– గమ్యస్థానం: సింగపూర్ (WSSL)
– ప్రయాణ తేదీ: 06-12-2024
– బయలుదేరు సమయం: 05:00 ఉదయం
– విమాన ఆపరేటర్: ఎం/స్ లక్స్ ఏవియేషన్ సాన్ మారినో
– విమాన రకం: GLEX
– కాల్ సైన్: T7-RIC
– ప్రయాణీకులు: 01
– సిబ్బంది: 04
– ప్రయాణ ఉద్దేశ్యం: ప్రైవేట్ ప్రయాణం.
Prajavartha Online Telugu News