Breaking News

డ్రోన్ల ద్వారా సర్వే చేసి వ్యర్ధాలు పేరుకుపోయిన ప్రాంతాలను గుర్తించండి

-పారిశుధ్య నిర్వహణలో స్పెషల్ డ్రైవ్స్ ను నిర్వహించండి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డ్రోన్ల ద్వారా వ్యర్ధాలు పేరుకుపోయిన ప్రాంతాలను సర్వేలెన్సు చేసి, గుర్తించి, స్పెషల్ డ్రైవ్ ద్వారా తొలగించాలని
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని మీటింగ్ హాల్లో సానిటరీ ఇన్స్పెక్టర్లు సూపర్వైజర్లు మరియు ప్రజారోగ్య సిబ్బందితో పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్ష సమావేశం లో అన్నారు. ప్రతి సానిటరీ ఇన్స్పెక్టర్ ని పేరుపేరునా అడిగి, వారు విధులు నిర్వహిస్తున్న డివిజన్ ని ప్రాంతాలను తెలుసుకున్నారు. ముందుగా వరదల సమయంలో వారు చేసిన పనితీరును అభినందించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర పారిశుధ్య నిర్వహణలో సానిటరీ ఇన్స్పెక్టర్ల పాత్ర కీలకమని, ప్రతి ప్రాంతం నీ ప్రాధాన్యతిస్తూ, ప్రజల ప్రతి సమస్యని తీరుస్తూ పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా ప్రతి వర్కర్ పని చేసేలా చెయ్యడం సానిటరీ ఇన్స్పెక్టర్లకు, ఎంతోఅవసరమని, నగరంలో పారిశుధ్య నిర్వహణకు కావాల్సిన తోపుడు బండ్లు ,సరిపడా వ్యర్థ సేకరణ వాహనాలు దానికనుగుణంగా సౌకర్యాన్ని కల్పిస్తున్నారని, తద్వారా పారిశుద్ధ్య నిర్వహణను సక్రమంగా చేస్తూ మరోవైపు ట్రేడ్ లైసెన్స్ లు సంపూర్ణంగా వసూలు చేయాలని అన్నారు.

వాహనాలలో వ్యర్ధాలను తరలిస్తున్నప్పుడు నల్లటి కవర్తో కప్పి ఉంచి తీసుకెళ్లేలా చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. నగరంలో వ్యర్థాలు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, వన్ టైం డ్రైవ్ లో అక్కడున్న వ్యర్ధాలను తరలించాలన్నారు. అలా తరచుగా డ్రోన్ల సహాయంతో వ్యర్ధాలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో గమనించి వన్ టైం డ్రైవ్ నిర్వహించి వ్యర్థాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరిండెంటింగ్ ఇంజనీరు పీ సత్య కుమారి,అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు డాక్టర్ రామ కోటేశ్వరరావు, డాక్టర్ బాబు శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇంచార్జ్ వెహికల్స్ ఏసుదాసు, సానిటరీ ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *