Breaking News

తిరుపతి జిల్లాలో రెండవ రోజు రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీలు 943

-ప్రజల ముంగిటకు అధికార యంత్రాంగం వచ్చి వారి రెవెన్యూ సమస్యల పరిష్కారం చేయుట కొరకే రెవెన్యూ సదస్సులు
-రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 6 నుండి జరుగుచున్న రెవెన్యు సదస్సులు కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా నందు రెండవ రోజు ప్రజల ముంగిటకు అధికార యంత్రాంగం వచ్చి వారి రెవెన్యూ సమస్యల పరిష్కారం కొరకు గ్రామ సభలను నిర్వహించడం జరిగింది. జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గం, పుదిపట్ల మరియు కల్ రోడ్ పల్లి గ్రామ సభలలో చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని, శ్రీకాళహస్తి నియోజకవర్గం, శ్రీకాళహస్తి మండలం వెలవేడు గ్రామ సభలో శాసనసభ్యులు బొజ్జల సుదీర్ రెడ్డి, సూళ్ళూరుపేట నియోజకవర్గం, నాయుడుపేట మండలం, అయ్యప్పరెడ్డి పాల్యం గ్రామ సభలో శాసన సభ్యులు శ్రీమతి నెలవల విజయశ్రీ, వెంకటగిరి నియోజకవర్గం, వెంకటగిరి మండలం, పెరియవరం గ్రామ సభలో శాసన సభ్యులు కె. రామకృష్ణ మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు జరిగిన రెవెన్యూ సదస్సుల ద్వారా వివిధ సమస్యలతో కూడిన దరఖాస్తులు తిరుపతి జిల్లా రెవెన్యూ డివిజన్లో 276 అర్జీలు, శ్రీ కాళహస్తి 169, సూళ్ళూరు పేట 226, గూడూరు 272 వెరసి అర్జీలు మొత్తం 943 అర్జీలు వచ్చాయని అందులో 11 ఆర్జీలకు సంబందించిన సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించడం జరిగిందని, మిగిలిన 932 అర్జీల సమస్యలను కాల పరిమితి లోపల సంబందిత అధికారులు పరిష్కరిస్తారని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త నియమావళి ప్రకారం నగరంలోని నాలుగు రంగుల చెత్తబుట్టలను ఏర్పాటు చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *