–పిల్లల బంగారు భవిష్యత్తే…కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్
–‘తూర్పు’లో ఉత్సాహంగా సాగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తల్లిదండ్రుల త్యాగాల ఫలితమే పిల్లల భవిష్యత్తు అని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. పిల్లల బంగారు భవిష్యత్తు లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
శనివారం ఉదయం తూర్పు నియోజకవర్గం పరిధిలోని కృష్ణలంక అమరజీవి పొట్టి శ్రీరాములు హైస్కూల్, ఎలిమెంటరి స్కూల్, వంగవీటి మోహన రంగారావు నగర పాలక సంస్థ బాలికల ఉన్నత పాఠశాల, ఎలిమెంటరి స్కూల్ ఆవరణలో వేర్వేరుగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగాయి. ఆయా పాఠశాల ఆవరణలో జరిగిన ఈ ఆత్మీయ సమావేశాల్లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ముఖ్యఅతిధిగా హజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూటమి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామమోహన్ మాట్లాడుతూ సమాజంలో ఉత్తమ పౌరులుగా తయారు కావాలంటే చదువు ద్వారానే సాధ్యమన్నారు. ఆస్తులు ఇస్తే పిల్లలు పాడు చేసుకుంటారని నాణ్యమైన విద్య అందించడమే గొప్ప ఆస్తి అన్నారు. పిల్లలను బలవంతంగా నైనా స్కూల్‌కు పంపాలని, పిల్లలను స్కూల్‌కు పంపని తల్లిదండ్రులను అరెస్ట్ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గతంలో అసెంబ్లీలోనే చెప్పారని అన్నారు. అప్పుడు చాలా మంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాటలను తప్పు పట్టారని చెప్పారు. పేదరికంలో ఉన్న వారు ఎంతో మంది సాప్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారంటే అది చదువుకోవడం వల్లనేనని అన్నారు. తల్లిదండ్రుల త్యాగ ఫలితమే పిల్లల భవిష్యత్తు అని అన్నారు. తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి, తిన్నా తినకపోయినా పిల్లలు చదువుకోవాలనే ఆలోచనతో ఉంటారని చెప్పారు. పిల్లలను బడికి పంపడమే కాకుండా వారి నడవడికను కూడా తల్లిదండ్రులు గమనిస్తు ఉండాలని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. సెల్‌ఫోన్ వల్ల యువత చెడుమార్గాల వైపునకు పయనిస్తున్నారని చెప్పారు. ఒక మహిళను చదివిస్తే ఆ కుటుంబం మొత్తం చదువుకున్నట్లేనని అన్నారు. పిల్లలు పాఠశాలకు రావడానికి ఆసక్తీ చూపాలనే ఉద్దేశ్యంతో మధ్యాహ్నా భోజనం పథకాన్ని, యూనిఫాం, పుస్తకాలను ప్రభుత్వమే అందజేస్తోందన్నారు. చదువుకున్న వారికి ఉద్యోగాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని అన్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని తమలోని నైపుణ్యాలను పెంచుకోవాలన్నారు. ప్రవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రవేటు క్లాసులు పెట్టి చదివించి పరీక్షల్లో వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ పాఠశాలలు కూడా ఉన్నాయని చెప్పారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం ఈ చదువుల పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించేందుకు తాము సిద్దంగా ఉన్నామని చెప్పారు. కృష్ణలంక స్కూల్ ఆవరణలో ప్రైమరీ, ఉన్నత పాఠశాల, కళాశాల, ఇండోర్ స్టేడియం ఇలా అన్ని సౌకర్యాలు ఈ స్కూల్ ఆవరణలో ఉన్నాయన్నారు. పాఠశాలకు అవసరమైన సౌకర్యాలు గురించి ప్రధానోపాధ్యాయులు తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. గత ప్రభుత్వ హాయంలో గంజాయి వంటి మత్తు పదార్థాలను పాఠశాల ఆవరణకు తీసుకువచ్చిన సంఘటనలు ఉన్నాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్తు పదార్థాల సరఫరా కాకుండా పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకుని మంచి భవిష్యత్తును సొంతం చేసుకోవాలని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంఈవోలు సాంబశివరావు, రామారావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్, శేఖర్, రేషమ్మ, గొరిపర్తి నామేశ్వరరావు, వల్లూరు మధు, పల్లపు రాజు, నాగలక్ష్మి, నిమ్మల జ్యోతిక, ముళ్ళపూడి నాగేశ్వరరావు, కొవ్వూరి కిరణ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News