Breaking News

వేగ జ్యూవెల్లర్స్‌ సిద్‌ శ్రీరామ్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలో ప్రముఖ సింగర్‌ సిద్‌ శ్రీరామ్‌ సందడి చేసారు. వేగా జ్యూవెలర్స్‌ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8 తేదిన నగరంలో జరగబోయే లైవ్‌ కాన్సెప్ట్‌కి సంబంధించిన బిగ్‌ టికెట్‌ బ్రోచర్‌ని ఆవిష్కరించారు. అనంతరం సిద్‌ శ్రీరామ్‌ మాట్లాడుతూ నేను తమిళం అయినా తెలుగులోనే హిట్స్‌ ఉన్నాయని చెప్పారు. నువ్వుంటే నా జతగా సాంగ్‌ తనకు ఫేవరేట్‌ అని తెలిపారు. మ్యూజిక్‌ తన లైఫని రామానుజం గురువని చెప్పారు. 2019 సంవత్సరంలో కర్ణాటకలో లైవ్‌ కాన్సెప్ట్‌ చేసానని గుర్తుచేసారు. రొమాంటిక్‌ సాంగ్స్‌ చాలా పాడానని జానపద పాటలు ఎక్కువుగా పాడాలని కోరుకుంటున్నానన్నారు. అడిగా అడిగా పాట గుండెల్లో ఉండి పోతుందన్నారు. హరిహారణ్‌ తన ఫెవరేట్‌ సింగర్‌ అని కమల్‌హాసన్‌ ఫేవరేట్‌ యాక్టర్‌ అని తెలిపారు. ఫిబ్రవరి 8వ తేదీన విజయవాడలో లైవ్‌ పర్ఫామెన్స్‌ ఇస్తున్నట్లు తెలిపారు. నాతో లైవ్‌ కాన్సెప్ట్‌ ఏర్పాటు చేస్తున్న వేగా జ్యూవెలర్స్‌ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. విజయవాడతో ఎంతో అనుబంధం ఉందని అందుకే లైవ్‌ పర్ఫామెన్స్‌ చేస్తున్నట్లు వెల్లడిరచారు. వేగా జ్యూవెలర్స్‌ అధినేత నవీన్‌ మాట్లాడుతూ సిద్‌ శ్రీరామ్‌ ప్రోగ్రాం విజయవాడలో పెట్టాలని ఏడాది నుంచి శ్రేయస్‌ మీడియా ద్వారా ట్రై చేస్తున్నామన్నారు. 2025 ఫిబ్రవరి 8 తేదిన జరిగే ప్రోగ్రాంలో నగర వాసులు పాల్గోనాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో శ్రేయస్‌ లైవ్‌ ఈవెంట్‌ ప్రతినిధి విపున్‌ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *