దైవ భక్తి – భవానీ దీక్ష అనేది దుర్గామాతను ఆరాధించే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ నియోజకవర్గంలోని ఘంటసాల సంగీత కళాశాల నందు ఆల్ ఇండియా భవానీ దీక్ష ఛారిటబుల్ ట్రస్ట్ అఖిల భారత భవానీ దీక్ష వ్యవస్థాపక గురుపీఠం శ్రీ దుర్గా భవాని దీక్షా జాతీయ సదస్సు ఆదివారం నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని ముందుగా జ్యోతి ని వెలిగించి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి,జగన్మాతను కొలవని ఊరుండదు, దుర్గమ్మ విగ్రహం కనిపించని వీధి ఉండదు, ఎక్కడ చూసినా, ఎటు చూసినా ఎరుపు రంగు వస్త్రాలు ధరించిన అమ్మ భక్తులే అని…
భవానీ దీక్ష అనేది దుర్గామాతను ఆరాధించే ఒక ఆధ్యాత్మికతకు చేరువ అవ్వడానికి ఒక దారి అని,ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ దీక్ష ద్వారా భక్తులు దుర్గామాత అనుగ్రహాన్ని పొందుతారు. విజయవాడ శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అభివృద్ధి మొన్న జరిగిన దసరా వేడుకలకు,  భక్తులు క్యూ లైన్ లో రోడ్లపై నిలబడి వేచి ఉండకుండా వెయిటింగ్ హాల్స్ నిర్మించి,కనకదుర్గమ్మ ఆలయం ప్రతిష్టను కాపాడే విధంగా కనకదుర్గమ్మ ఆలయంలో రాబోయే వందేళ్ళకు భక్తులకు అవసరాలకు సరిపోయే విధంగా మౌలిక వసతులు సదుపాయాలు కల్పించి కూటమి ప్రభుత్వం చరిత్రలోనే ఎన్నడూ చూడనటి విజయవాడ కనకదుర్గ అమ్మవారి దసరా వేడుకలు నిర్వహించింది అని.. ఆ అమ్మవారి చల్లని దీవెనలతో దీక్షాపరులతో పాటు  ప్రజలు కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దుర్గా అమ్మవారిని కోరుకుంటున్నట్టు  బొండా ఉమా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ జాతీయ అధ్యక్షులు లంక గణేష్ గురు భవాని, ట్రస్ట్ కార్యదర్శి లంక మోహన్ శ్రీనివాసరావు, బొగ్గు రాము, నీలాపు చక్రపాణి, రాంబాబు, నాగు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *