-స్వయం ఉపాధి అవకాశాలపై హైదరాబాదులోని ఎన్.ఐ.ఆర్.డి లో అవగాహన శిక్షణ
-మొదట విడతగా తిరువూరు నుంచి వెళ్లిన 50 మంది గ్రామీణ యువత
-జెండా ఊపి బస్సును ప్రారంభించిన టిడిపి నాయకులు
తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ ప్రెన్యూర్ వుండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ కృషి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ యువతకు స్వయం ఉపాధి కోసం అందిస్తున్న పథకాలపై నిరుద్యోగ యువతకు అవగాహన కల్పించి ఆ తర్వాత శిక్షణ ఇప్పించేందుకు జాతీయ గ్రామీణాభివృద్ది సంస్థ (ఎన్.ఐ.ఆర్.డి) సహకారంతో అవగాహన సదస్సు హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సహకారంతో ఈ అవగాహన సదస్సుకి మొదట విడతగా తిరువూరు నియోజకవర్గం నుంచి ఎంపిక చేసిన 50 మంది గ్రామీణ యువతను సోమవారం తెల్లవారుజామున బస్సులో హైదరాబాద్ కి పంపించటం జరిగింది. పట్టణంలోని దారా పూర్ణయ్య టౌన్ షిప్ లోని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కార్యాలయం వద్ద ఈ బస్సుకు టిడిపి సీనియర్ నాయకులు జెండా ఊపి ప్రారంభించారు. ఇక నుంచి ప్రతి నెల ఒక్కో నియోజకవర్గం నుంచి రూరల్ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ యువకులు, రైతులను ఎన్.ఐ.ఆర్.డి కి పంపించి స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన, శిక్షణ ఇప్పిస్తామని ఒక ప్రకటనలో ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నాళ్ళా సురేంద్ర, కౌన్సిలర్ షేక్ అబ్ధుల్ హుస్సేన్, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు మారేపల్లి వంశీ, 18వ వార్డ్ అధ్యక్షులు భూమా సురేష్, 16వ వార్డ్ అధ్యక్షుడు ఉదారపు మార్కండేశ్వరరావు, టిడిపి సీనియర్ నాయకులు కొంచి రఘు ప్రవీన్,సోమవరపు శ్రీనివాసరావు, షేక్ హసన్ , గుడిమెట్ల రాము, టి.వి.ఆర్ గవర్నమెంట్ హాస్పటల్ డైరెక్టర్ ఆకుల దుర్గా ప్రసాద్, అడ్వకేట్ వాకదాని లక్ష్మీనారాయణ, అడ్వకేట్ రాజవరపు శ్రీనివాసరావు, టిడిపి పట్టణ సీనియర్ నాయకులు సింధు శ్రీను, దుక్కిపాటి ప్రసాద్, తాళ్ళూరి సుధాకర్ , షేక్ హన్నీ, చిత్తలూరు శశి, 15వ వార్డ్ నాయకులు కొంగల మురళీ, 103 బూత్ కన్వీనర్ రామకృష్ణ (బుడ్డయ్య), బూత్ కన్వీనర్ చిల్లపల్లి రామకృష్ణ, జనసేన నాయకులు జయప్రకాష్ లతో పాటు ఎన్డీయే కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News