-కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి వెల్లడి
-ఎంపి కేశినేని శివనాథ్, ఎంపి బి కె పార్ధసారథి, ఎంపి దగ్గుమల్ల ప్రసాదరావు ప్రశ్నలకు కేంద్రం బదులు
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన్ మంత్రి పోషణ శక్తి నిర్మాణ పథకం (పీఎం పోషణ) కింద మొత్తంరూ.1.63 కోట్లు విడుదల చేయగా, 2019-20 లో రూ. 28,563.77 లక్షలు, 2020-21లో రూ. 37,510.17 లక్షలు, 2021-22లో రూ. 35,731.48 లక్షలు, రూ. 2022-23 లో రూ.36,531.92 లక్షలు, 2023-24 లో రూ.25,342.88 లక్షలు మంజూరైనట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి వెల్లడించారు.
గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఎం పోషణ్ కింద నమోదు చేయబడిన పాఠశాలల వివరాలు, ఈ పథకం కింద రాష్ట్రానికి విడుదల చేసిన నిధుల వివరాలతో పాటు పి.ఎం పోషణ పథకం కి సంబంధించి పలు ప్రశ్నలు సోమవారం లోకసభలో ఎంపి కేశినేని శివనాథ్, ఎంపి బి కె పార్ధసారథి, ఎంపి దగ్గుమల్ల ప్రసాదరావులతో కలిసి కేంద్ర విద్యాశాఖ మంత్రిత్వ శాఖను అడగటం జరిగింది. వీటిని ఆ శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
అలాగే గత ఐదేళ్లలో ఈ పథకం కింద ఎపిలో మొత్తం 2,24,751 పాఠశాలలు నమోదు కాగా, 2019-20 లో 45,484 పాఠశాలలు, 2020-21లో 45,545 పాఠశాలలు, 2021-22 లో 45,180 పాఠశాలలు, 2022-23 లో 44,392 పాఠశాలలు, 2023-24 లో 44,150 పాఠశాలలు నమోదు అయినట్లు తెలిపారు. అలాగే హిందూపూర్ నియోజకవర్గంలో 2019-20లో 2,116 పాఠశాలలు ఉండగా, 2023-24లో ఈ సంఖ్య 2,098 గా నమోదైందని… చిత్తూరు నియోజకవర్గంలో 2019-20లో 2,501 పాఠశాలలు ఉండగా, 2023-24లో 2,514 గా ఉన్నట్లు తెలియజేశారు.
ఈ పథకం కేంద్ర, రాష్ట్ర భాగస్వామంతో అమలు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి ఎనిమిది తరగతుల విద్యార్ధులకు , ప్రభుత్వ అనుబంధ పాఠశాలల బాలవాటిక (ప్రీ-ప్రైమరీ తరగతులు) విద్యార్ధులకు పాఠశాల పనిదినాల్లో భోజనం కూడా అందిస్తుంది. గత ఐదేళ్లలో ఎపిలో ఈ పధకం ద్వారా మొత్తం 1 కోటి 55 లక్షల 90 వేల 312 మంది విద్యార్ధులు లబ్ధి పొందినట్లు వివరించారు. 2023-24 సంవత్సరానికి గాను 520 సార్లు సోషల్ ఆడిట్ నిర్వహించగా, 2023-24 లో వంట చేయటంతో పాటు సాయం చేసేందుకు మొత్తం 81,232 మంది మహిళ లను తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన నివేదిక లో వున్నట్లు చెప్పారు. పీఎం పోషణ పథకం విద్యార్థులకు పోషక ఆహారం అందించడంతోపాటు, పాఠశాల భోజన పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడంలో కేంద్రం ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు
Prajavartha Online Telugu News