గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ హెడ్ వాటర్ వర్క్స్ కు ఉండవల్లి నుండి త్రాగునీటి సరఫరా జరిగే 1600 ఎంఎం డయా పైప్ లైన్ పై తక్కెళ్లపాడు గ్రామంలో ఏర్పడిన లీకు వలన అధిక మొత్తంలో నీరు వృధా అవుతున్నందున లీకు మరమత్తు పనులను బుధవారం ఉదయం సరఫరా అనంతరం చేపట్టడానికి ఇంజినీరింగ్ అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్దం చేశారని, పనుల వలన బుధవారం సాయంత్రం నుండి గురువారం సాయంత్రం వరకు (11,12 తేదీలు) నగరంలోని పలు ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాలో అంతరాయం కల్గుతుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, తక్కెళ్లపాడు గ్రామంలోని పైప్ లైన్ పై ఏర్పడిన లీకు మరమత్తు పనుల కోసం హెడ్ వాటర్ వర్క్స్ లోని ఫిల్టరేషన్ ప్లాంట్ ని పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుందన్నారు. మరమత్తు పనులు చేపట్టే బుధవారం సాయంత్రం నుండి గురువారం సాయంత్రం వరకు నగరంలోని నెహ్రు నగర్, శారదా కాలనీ, వసంతరాయపురం, హెచ్ఎల్ఆర్, ఐపిడి కాలనీ, స్తంభాల గరువు, గుజ్జనగుండ్ల, విద్యా నగర్, హనుమయ్య నగర్, నల్లచెరువు, శ్రీనివాసరావుతోట, తారకరామ నగర్, ఏటి అగ్రహారం, బిఆర్ స్టేడియం, ఎల్బి నగర్, గోరంట్ల, అడవి తక్కెళ్లపాడు, రాజీవ్ గాంధీ నగర్, కోర్ట్ కాంపౌండ్, మిర్చి యార్డ్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, కేవిపి కాలనీ, శ్యామలానగర్, రెడ్డి పాలెం రిజర్వాయర్ల పరిధిలో పూర్తిగా త్రాగునీటి సరఫరా నిలుపుదల జరుగుతుందాని, శుక్రవారం ఉదయం నుండి యధావిధిగా సరఫరా జరుగుతుందని తెలిపారు. కావున నగర ప్రజలు త్రాగునీటి సరఫరాలో అంతరాయం గమనించి, తగిన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు.
Prajavartha Online Telugu News