Breaking News

రాష్ట్ర సచివాలయంలో ప్రధానమంత్రి 15 పాయింట్ల కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నేషనల్ మైనారిటీ కమిషన్ మెంబర్ మిస్ సయ్యద్ షహజాది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ప్రధానమంత్రి 15 పాయింట్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల రాష్ట్రస్థాయి అధికారులు మరియు మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు లను రాష్ట్రంలో మైనారిటీలకు జరుగుతున్న సహాయ కార్యక్రమాలు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి అందుతున్న పథకాల గురించి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే మైనారిటీలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న హాస్టల్స్ ను , PMJVK తరగతి భవనాలను మరియు హాస్టల్ భవనాలను త్వరగా అందుబాటులోకి తెచ్చి అందులో తరగతులను నిర్వహించవలసిందిగా రాష్ట్ర అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ కె హర్షవర్ధన్ ఐఏఎస్, కమిషనర్ చిట్టూరి శ్రీధర్ ఐఏఎస్, షేక్ షేరీన్ బేగం ఐపీఎస్, సర్వే కమిషనర్ ఆఫ్ వక్ఫ్ మరియు వివిధ రాష్ట్రస్థాయి శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఉర్దూ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ
నేషనల్ మైనార్టీ కమిషన్ మెంబర్ మిస్ సయ్యద్ షహజాది విజయవాడ లోని భవానిపురంలో గల ఉర్దూ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు, అలాగే విద్యార్థులతో మాటమంతి కార్యక్రమాన్ని నిర్వహించి వారికి అందుతున్న సౌకర్యాల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా తమరిని సంప్రదించవలసిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి అయిన అబ్దుల్ రబ్బాని పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *