Breaking News

జిల్లాలో నేడు రెవెన్యూ సదస్సులకు వచ్చిన అర్జీలు: 652

-నిబంధనల మేరకు భూపత్రాలు సక్రమంగా ఉంటే రెవెన్యూ, భూ సమస్యల పరిష్కారానికి చక్కటి వేదిక రెవిన్యూ సదస్సులు..
-గ్రామాల అభివృద్ధికి పట్టుకొమ్మలు ఈ రెవెన్యూ సదస్సులు : జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
భూ పత్రాలు సక్రమంగా ఉంటే రెవెన్యూ, భూ సమస్యల పరిష్కారానికి చక్కటి వేదిక రెవిన్యూ సదస్సులని జిల్లా వ్యాప్తంగా జరుగుచున్న రెవిన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు సంబంధించి బుధవారం తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఏర్పేడు మండలం, వికృతమాల గ్రామ రెవెన్యూ సదస్సులో పాల్గొని మాట్లాడుతూ రైతులు, ఇతరులు ముందుకు వచ్చి వారి యొక్క భూ తగాదాలకు, రెవెన్యూ సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు. సూళ్లూరుపేట శాసనసభ్యులు నెలవల విజయశ్రీ తడ మండలం గ్రామ రెవెన్యూ సదస్సులో పాల్గొని రెవెన్యూ, భూ సమస్యలను సులభతరంగా పరిష్కరించుకోవడానికి అనువైన వేదిక రెవెన్యూ సదస్సులు అని ఈ అవకాశాన్ని సదరు గ్రామ ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని శాసనసభ్యులు తెలిపారు.

రెవెన్యూ సమస్యల పరిష్కారం కొరకు జిల్లావ్యాప్తంగా నేడు 47 గ్రామ సభలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో నేడు జరిగిన రెవెన్యూ సదస్సులో స్థానిక శాసనసభ్యులు, ప్రజా ప్రతినిధులు నియోజక వర్గ, మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారన్నారు. రెవెన్యూ సదస్సుల ద్వారా వివిధ సమస్యలతో కూడిన దరఖాస్తులు తిరుపతి జిల్లాలో మొదటి రోజు నుండి నేటి వరకు జిల్లావ్యాప్తంగా 4571 అర్జీలు అందాయని అందులో నేడు 652 అర్జీలు వచ్చాయని అందులో ల్యాండ్ గ్రాభింగ్ పై -12, రీ సర్వే పై -21, ఫామ్ 22 ఏ పై -83, హౌస్ సైట్స్ పై 98 ఆర్ ఓ ఆర్ పై -289, అసైన్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్ పై -40, ఇతర విషయాల సంబంధించి – 81 అర్జీలు వచ్చాయని తెలిపారు. ఈరోజు వచ్చిన 19 అర్జీల సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించడం జరిగిందని మిగిలిన అర్జీల సమస్యలను కాల పరిమితి లోపల సంబందిత అధికారులు పరిష్కరిస్తారని జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *