Breaking News

29న స్వర్ణోత్సవ వేడుకల‌లో నాటి, నేటి విద్యార్థుల సమ్మేళనంకు సిద్ధమౌతున్న శారదా క‌ళాశాల‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స‌త్య‌నారాయ‌ణ‌పురంలోని శారదా క‌ళాశాల‌ 29న స్వర్ణోత్సవ వేడుకలు, నాటి, నేటి విద్యార్థుల సమ్మేళనంకు సిద్ధమౌతోంది. గురువారం ఈ సందర్భంగా క‌ళాశాల‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి కుందా రామనారాయణ మాట్లాడుతూ కళాశాల 1974లో ప్రారంభమై 2024 నాటికి 50 ఏళ్లు పూర్తి చేసుకున్నందున డిసెంబర్‌ 29న స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని ఈ స్వ‌ర్ణోత్స‌వ వేడుక‌లు సంద‌ర్భంగా పూర్వ విద్యార్థుల సమ్మేళ‌నం ఏర్పాటు చేశామ‌న్నారు. ఈ న‌మావేశం ఏర్పాటుతో పూర్వ విద్యార్థులు ఒకరితో ఒకరు మరియు సంస్థతో మళ్లీ కనెక్ట్ అవ్వడానికి, నెట్‌వ‌ర్క్‌ను పెంపొందించుకోవ‌డానికి దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని తెలిపారు. పునః క‌ల‌యికను రూపొందించ‌డం ఎంతో క‌ష్ట‌మైన ప‌ని అయిన‌ప్ప‌టికీ దానివ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఎంతో విలువైన‌వ‌ని పేర్కొన్నారు. పూర్వ విద్యార్థుల స‌మ్మేళ‌నంతో శారదా కళాశాలకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా ప్రస్తుత మరియు భవిష్యత్తు విద్యార్థులకు అందుబాటులో ఉన్న సపోర్ట్ నెట్‌వ‌ర్క్‌ను బ‌లోపేతం చేస్తుందన్నారు. పూర్వ విద్యార్థులు మరియు ప్రస్తుత విద్యార్థుల ప్రదర్శనలతో ఈ కార్యక్రమం మరింత ఉత్సాహాన్ని నింపుతుంద‌న్నారు. అనంతరం స్వ‌ర్ణోత్స‌వ వేడుక‌లు నిర్వ‌హ‌ణ‌పై చ‌ర్చించారు. ఈ స‌మావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎస్‌.నాగేశ్వర శర్మ, హెచ్‌వోడీలు, అధ్యాపకులతో పాటు, శారదా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎల్‌.శ్రీధర్, ఫ్యాకల్టీ మరియు శారదా ఇంగ్లీషు మీడియం హైస్కూల్ ప్రిన్సిపాల్ ఎ.ఎల్‌.ఎన్‌.మూర్తి, సిబ్బంది, క‌ళాశాల పూర్వ విద్యార్థులు విజయ్‌కుమార్, మారుతి ప్రసన్న‌, పూర్వ విద్యార్ధుల కన్వీనర్ డాక్టర్ డి.కైలాసరావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *