Breaking News

అంగన్ వాడి కేంద్రాల్లో ప్రీస్కూల్ పిల్లలకు యస్.బి.ఐ కిట్లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్ టి ఆర్ జిల్లా విజయవాడ అర్బన్ ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడీ కేంద్రాలకు విలువైన, నాణ్యమైన వస్తు సామాగ్రిని పంపిణీ చేశారు. ఎస్ బి ఐ పాన్ ఇండియా సి ఎస్ ఆర్ యాక్టివిటీస్ ఆఫ్ గ్రేడింగ్ అంగనవాడి కేంద్ర అమరావతి సర్కిల్ మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిల్లలకు అవసరమైన,వంట సామాగ్రి, ఎల్ సి డి టీవీ కిడ్స్, చిల్డ్రన్స్ ప్లేయింగ్ కిడ్స్,వాటర్ ఫిల్టర్, ప్లేట్స్, గ్లాసులు, స్కూల్ బ్యాగ్స్, బుక్స్, పెన్సిల్ బాక్స్ జారుడు బల్ల, వాటర్ బాటిల్స్, బాస్కెట్బాల్స్, ఊగుడు గుర్రంతో పాటు, పలు రకాల ఆట వస్తువులను ఎస్ బి ఐ పాన్ ఇండియా సి ఎస్ ఆర్ యాక్టివిటీస్ ఆఫ్ గ్రేడింగ్ చైర్మన్ లక్ష్మీ రెడ్డి అందజేశారు. ఈసందర్భంగాఆమెమాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అంగనవాడి కేంద్రాలకు అవసరమగు నాణ్యతా ప్రమాణాలు కలిగిన వస్తు సామాగ్రిని అంగనవాడి కేంద్రంలోని పిల్లలకు ఉపయోగపడేవి అవసరమైన మేరకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా అంగన్ వాడి కేంద్రాలకు అందజేసినట్లు వివరించారు. ఈకార్యక్రమంలో ఐసిడిఎస్ విజయవాడ అర్బన్ ప్రాజెక్టు సూపర్వైజర్లు వి.విజయ, వి. నాగమణి, అంగన్వాడి కేంద్ర సిబ్బంది, గిరిపురం అంగన్వాడీ కేంద్ర 1 కార్యకర్త సునీత, వెంకటేశ్వర మాన్యం2 అంగనవాడి కార్యకర్త కళావతి,వాంబే కాలనీ9 కార్యకర్త పద్మ,ప్రకాష్ నగర్ 2 సుజాత మరియు తల్లులు, అంగన్వాడి కేంద్ర హెల్పర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *