-గన్నవరం విమానాశ్రయానికి ఎన్‌టీఆర్-రామోజీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరు పెట్టాలని విజ్ఞప్తి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ విమానాశ్రయానికి ఎన్‌టీఆర్-రామోజీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరు పెట్టాలని ఎడిటర్స్ గిల్డ్ సౌతిండియా అధ్యక్షుడు జి.దీక్షా ప్రసాద్ విజయవాడ విమానాశ్రయం ఎయిర్ పోర్ట్ అడ్వజరీ కమిటీ వైస్ చైర్మన్, ఎంపి కేశినేని శివనాథ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఎడిటర్స్ గిల్డ్ సౌతిండియా (ఈ.జి.ఎస్) అధ్యక్షుడు జి.దీక్షా ప్రసాద్ నేతృత్వంలో ఈజిఎస్ సభ్యులు శుక్రవారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఎంపి కేశినేని శివనాథ్ ను కలిశారు.
ఉమ్మడి కృష్ణ జిల్లాకు చెందిన తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు, తెలుగు జర్నలిజానికి దేశ వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన ఈనాడు అధినేత చెరుకూరి రామోజీరావు పేర్లు కలిపి పెడితే స్పూర్తి దాయకంగా వుంటుందని, ఈ మేరకు ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ సౌతిండియా ఇటీవల ఒక తీర్మానం చేసినట్లు తెలిపారు. ఈ ప్రతిపాదన పై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌరవిమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కలిసి వినతి పత్రాలు అందజేసినట్లు తెలిపారు. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ సౌతిండియా అధ్యక్షుడు దీక్షా ప్రసాద్ చేసిన అభ్యర్ధనను పరిశీలిస్తానని ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఎల్. అశోక్, కోశాధికారి జి.తరుణ్ తేజ, ఎగ్జిక్యూటివ్ కమిటీ బి.జి.గౌడ, పి.బాబ్జీ, ఎమ్.షణ్ముగం పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News