Breaking News

జిల్లాలో (బేటీ బఛావ్ భేటీ పడావో) బాలికలను కాపాడుదాం.. బాలికలను చదివిద్దాం అనే నినాదంను ప్రజల్లో అవగాహన కల్పించాలి

-కిశోరి వికాసం పై గ్రామ/మండల స్థాయి లో మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి : జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శుభం బన్సల్
-ఆడపిల్లలకు రక్షణ కల్పించడంతో పాటు వారికి వారి హక్కులను కూడా కల్పించాలి : శిశు సంక్షేమ శాఖ అధికారి జయలక్ష్మి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో (బేటీ బఛావ్ భేటీ పడావో) బాలికలను కాపాడుదాం.. బాలికలను చదివిద్దాం అనే నినాదంను ప్రజల్లో అవగాహన కల్పించి, బాలికలపై జరుగుతున్న నేరాలను అరికట్టే దిశగా.. సంబంధిత శాఖ అధికారులు దృష్టి పెట్టాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు.

శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరం నందు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి జయలక్ష్మి, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శుభం బన్సల్ అధ్యక్షతన కిశోరి వికాసం జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం ( టి . ఓ.టి) జరిగింది.

జ్యోతి ప్రజ్వలన అనంతరం ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో (బేటీ బఛావ్ భేటీ పడావో) బాలికలను కాపాడుదాం.. బాలికలను చదివిద్దాం అనే నినాదంను ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. బాల్య వివాహాలు, టీనేజి ప్రెగ్నెన్సీ, రక్తహీనత నివారణను ప్రాధాన్యతగా తీసుకొని బాలికల సంక్షేమానికి కృషిచేయాలన్నారు. క్షేత్రస్థాయిలో సి డి పి ఓ లు, ఏ ఎన్ ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మహిళా పోలీసులు సమన్వయం చేసుకొని బాధ్యతగా బాల్య వివాహాలు నివారణ కు కృషి చేయాలని తెలిపారు. బాల్యవివాహాలు, చిన్న వయసులోనే గర్భం దాల్చడం వలన బాలికలు చదువుకు దూరం కావడం, అనారోగ్య సమస్యల పట్ల వారు ఎదుర్కొనే పరిస్థితులను తల్లిదండ్రులకు తెలియ చేయాలన్నారు. జిల్లాలో బడికి దూరం అవుతున్న బాలికలను గుర్తించి తిరిగి వారిని పాఠశాలలో చేర్చే విధంగా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బాలికలు పాఠశాలలకు వెళ్లక పోవడానికి గల పరిస్థితులను తెలుసుకొని చదువు పట్ల వారికి శ్రద్ధ కలిగేలా వెల్ఫేర్ అసిస్టెంట్స్ ప్రేరణ కలిగించాలన్నారు. కిశోరి వికాసం పై గ్రామ/మండల స్థాయిలోని వైద్య ఆరోగ్య శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, పోలీసుశాఖ లతో సమావేశము నిర్వహించి చిన్న వయస్సులో గర్భం దాల్చిన వారికి అవగాహన కల్పించి కౌమార దశ బాలికలను చైతన్యం పరచాలన్నారు.

మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి మాట్లాడుతూ… బేటి బచావో బేటి పడావో నినాదం లో ఆడ పిల్లల రక్షణ మరియు వారి చదువు కోసం ముఖ్య ఉద్దేశ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని ఇందులో భాగంగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ సంబందిత శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని అన్నారు. ఆడపిల్లలకు నేటి సమాజంలో రక్షణ లేకుండా పోయుందని వారికి అండగా ఉండాలంటే ఆడపిల్ల గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచి రక్షించుకోవాల్సిన భాధ్యత మన అందరిపై ఉందని, అలాగే వారి కాళ్ళ మీద వారు నిలబడాలంటే వారి చదువును ప్రోత్సహించాలని అన్నారు. ఇలా చేయగలిగితే వారికి ఆడపిల్లలకు రక్షణ కల్పించడంతో పాటు వారికి వారి హక్కులను కల్పించిన వారమవుతామని అన్నారు.

ఈ కార్యక్రమం అనంతరం భేటీ బచావో బేటి పడావో మీకోసం ఉచిత అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్ల పోస్టర్ ను ఇంచార్జ్ కలెక్టర్ శుభం బన్సల్ ఆవిష్కరించారు.

ఈ సమావేశంలో డి ఆర్ డి ఎ పి డి శోభన్ బాబు, జిల్లా నైపుణ్యాధికారి లోకనాథం, మహిళా పోలీసు డిఎస్పి శ్రీలత, జిల్లా విద్యాశాఖ అధికారి కెవిఎన్ కుమార్, డిఎంహెచ్వో శ్రీహరి, సి డి పి ఓ లు, సూపర్వైజర్లు, టి వో టి లు, స్వచ్చంద్ర సంస్థలు, సంబంధిత జిల్లా శాఖల అధికారులు
తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *