తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఈనెల 14 వ తేదీన జరిగే సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణను పారదర్శకంగా చేపట్టాలి అని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీవోలు, నోడల్ ఆఫీసర్లు, తాసిల్దారు లు, ఇరిగేషన్ అధికారులతో సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఈనెల 14 వ తేదీన జరిగే సాగు నీటి సంఘాల ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పగడ్బందీగా ఎలాంటి పక్షపాతం లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎలక్షన్ విధులు కేటాయించిన అధికారులకు శిక్షణ ఇవ్వడం జరిందని అన్నారు. ఇప్పటికే ఎలక్షన్ కు సంబంధించిన మెటీరియల్ అంతా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగిందని అన్నారు. చివరిగా సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించే అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బంది వారి విధులను సక్రమంగా నిర్వహించి సాగునీటి సంఘాల ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని తెలిపారు. పోలింగ్ నిర్వహించే కేంద్రాల్లో తాగునీటి వసతి, అత్యవసర వైద్య సదుపాయం ఉండేలా చూసుకోవాలని అన్నారు.
Prajavartha Online Telugu News