విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరిచడమే లక్ష్యంగా జగనన్న బాటలో పరిష్కార వేదిక కార్యక్రమం చేపట్టినట్లు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. సోమవారం స్థానిక 2 వ డివిజన్ చిన బోర్డింగ్ స్కూల్ వద్ద పరిష్కార వేదిక కార్యక్రమంలో 2వ డివిజన్ కార్పొరేటర్ నిర్మలా కుమారి తో కలిసి అవినాష్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం లో కుల మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ జనరంజకంగా పరిపాలన అందిస్తున్నారని, అదేవిధంగా అభివృద్ధి కి ప్రాధాన్యత ఇస్తూ నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు అని,ఆయన స్పూర్తితో అర్హులైన పేదలకు అన్యాయం జరగకుండా ఇంకా ఎవరికైనా సంక్షేమ పథకాలు అందకపోతే వారికి కూడా అందించాలి అనే లక్ష్యంగా మీ ఇంటి వద్దనే సమస్య పరిష్కారానికి ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టినట్టు చెప్పారు.రోజుకు ఒక డివిజిన్ చొప్పున సంబంధిత అధికారులు, కార్పొరేటర్ లతో కలిసి ప్రజలు అంత ఒక దగ్గర చేరేలా ఈ కార్యక్రమం చేపట్టి అక్కడికక్కడే వారి సమస్యకు తగు పరిష్కరానికి కృషి చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో చిట్టచివరి పేదవారికి కూడా సంక్షేమ ఫలాలు అందాలి అనేదే ముఖ్యమంత్రి లక్ష్యం అని అందుకే ఈ పరిష్కార వేదిక అని,కావున ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలను తెలియజేయవచ్చు అని సూచించారు. ఈ “పరిష్కార వేదిక” ఈ ఒక్కరోజుతో ఆగేది కాదు అని ఇది రోజు నిరంతర ప్రక్రియ అని అవినాష్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, స్టాండింగ్ కమిటీ నెంబర్ కలాపాల అంబేద్కర్, మరియు కార్పొరేటర్లు, ఇంచార్జిలు మరియు డివిజన్ నాయకులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జైలు వాతావరణం జైలులా కాకుండగా ఆశ్రమ వాతావరణమును తలపిస్తుంది
-జైలు వాతావరణం జైలులా కాకుండగా ఆశ్రమ వాతావరణమును తలపిస్తుంది -మహిళా ఖైదీలతో మాట్లాడి వారి క్షేమ సమాచారం తెలుసుకున్న.. -రాష్ట్ర …