
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ మధుకర్ భగవత్ శనివారం ఆలయమునకు విచ్చేయగా వీరికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సత్యనారాయణ, ఐఏఎస్ మరియు ఆలయ ఈవో కె ఎస్ రామరావు, డిప్యూటీ ఈవో ఎం రత్న రాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. ఈ సందర్బంగా వీరు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వీరికి వేదంపండితుల ఆలయ వేదపండితులచే వేదాశీర్వచనం కల్పించగా మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు ఆలయ ఈవో అమ్మవారి శేష వస్త్రం, ప్రసాదములు మరియు చిత్రపటం అందజేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆలయమునకు విచ్చేయగా వారికి గౌరవ స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించి, వేదపండితుల ఆశీర్వచనం కల్పించి, ప్రసాదములు అందజేసి గౌరవించామని తెలిపారు. అనంతరం డిసెంబర్ 21 నుండి 25 వరకు జరుగు భవానీ దీక్ష విరమణల సందర్బంగా దేవస్థానం వారు దసరా లాగే పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారని, ప్రభుత్వం నుండి కావలసిన సహకారములు అందిస్తున్నామని తెలిపి, ఈ సందర్బంగా చేసిన ఏర్పాట్ల గురించి తెలిపి, దీక్షా విరమణ సందర్బంగా భక్తుల సౌకర్యార్థం ముందస్తు బుకింగ్స్, దీక్షా సమాచారం, కౌంటర్లు, పార్కింగ్, టాయిలెట్స్, మెడికల్, సమయం వివరాలు తదితర సమాచారంతో కూడిన మొబైల్ ఆప్ ను ఆవిష్కరించి లాంచ్ చేశారు. భక్తులందరూ ప్లే స్టోర్ నుండి bhavani deeksha 2024 అను ఆప్ ను డౌన్ లోడ్ చేసుకొని వినియోగించుకొనవలసిందిగా తెలిపారు.
Prajavartha Online Telugu News