Breaking News

ప్రజలకు సంతృప్తికరమైన పరిష్కారాన్ని అందించండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయం తో పాటు జోనల్ కార్యాలయాల్లో నిర్వహించారు. పటమట సర్కిల్ 3 కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్ ఫిర్యాదులను స్వీకరించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నుండి స్వీకరించిన ప్రతి ఫిర్యాదును, సంతృప్తికరమైన పరిష్కారాన్ని అధికారులు ప్రజలకు అందించాలని, ప్రతి ఫిర్యాదును శాఖధిపతులు కచ్చితంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదుల స్వీకరించిన వెంటనే అధికారులు ఫిర్యాదుదారుల వద్దకు వెళ్లి వాళ్ళ సమస్యని అర్థం చేసుకొని, సమస్య ఉన్నప్పుడు ఫోటోను పరిష్కరించిన తర్వాత ఫోటోను జతపరచాలని అధికారులను ఆదేశించారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలు సర్కిల్ 3 కార్యాలయంలో ఆరు ఫిర్యాదులు అందగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సర్కిల్ 1, 2 మరియు ప్రధాన కార్యాలయంలో జరిగే ప్రజా ఫిర్యాదులను కమిషనర్ పరిశీలించారు. ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 11 ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. అందులో అత్యధికంగా పట్టణ ప్రణాళిక విభాగంలో ఏడు ఉండగా, ఇంజనీరింగ్ సంబంధించి 2, ప్రజారోగ్యం మరియు రెవెన్యూ విభాగంలో ఒక ఫిర్యాదును అధికారులు అందుకున్నారు.

సర్కిల్ 3 కార్యాలయం లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలలో జోనల్ కమిషనర్ 3 ఇంచార్జ్ ప్రభుదాస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు, అసిస్టెంట్ కమిషనర్ రెవెన్యూ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *