విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్షయ లేని భారదేశం కోసం కేంద్రప్రభుత్వం తలంప పెట్టిన వందరోజుల అవగాహనా శిభిరాలకు అనుగుణంగా యన్.టి.ఆర్ జిల్లా క్షయ నియంత్రణా విభాగం, వాసవ్య మహిళా మండలి సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఆటోనగర్ నందు ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఐలా చైర్మెన్ సుంకర్ దుర్గాప్రసాద్ ఐ.ఈ.సి స్టాల్ ను ప్రారంబించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వాసవ్య మహిళా మండలి అపోలో టైర్స్ సంయుక్త ఆద్వర్యంలో ఆటోనగర్ కార్మికులకు చేస్తున్న సేవలకు గాను సంస్థకు అభినందనలు తెలియజేసారు. ఆటోనగర్ లోని కార్మికులు ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలని, ఏదైనా అనారోగ్య సమస్యలు ఏర్పడితే అశ్రద్ధ చేయకుండా డాక్టరు ను సంప్రదించి చికిత్సను తీసుకోవాలని ఆయన హితవు పలికారు.
అనంతరం జిల్లా క్షయ నియంత్రణ సమన్వయకర్త సి.హెచ్. దినేష్ మాట్లాడుతూ క్షయ వ్యాధిలక్షణాలైన 15 రోజుల నుండి దగ్గు. కళ్ళె పడటం, సాయంత్రం వేళలో జ్వరం, ఆకలి లేకపోవడం, బరువు కోల్పోవడం, చిరు చమటతో పాటు గుండెలో నొప్పి ఇలా ఏలక్షణాలున్నా దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని ఆయన అన్నారు. ఒక వేల క్షయగా నిర్ధారణ అయితే ఆరు నెలలు మందులతో పాటు పౌష్టికాహారం కొరకు ప్రతినెల వెయ్యి రూపాయలను ప్రభుత్వం ఇస్తుందని కావున క్షయ ను పూర్తిగా నివారించవచ్చని దీనిపై అపోహలు మాని ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉంటే దీనిని 2030 లోపు దేశం నుండి పరదోలవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తపరచారు. ఈ అవగాహనా శిభిరాలు ఆటోనగర్ తో పాటు విజయవాడ పరిసర ప్రాంతాలలైన కామినేని నగర్, రామలింగేశ్వర్ నగర్, యనమలకుదురు కట్ట, సనత్ నగర్, రాణిగారితోట, క్రిష్ణలంక, రాజీవ్ నగర్, కండ్రిక తదితర ప్రాంతాలలో కూడా ఏర్పాటు చేస్తారని ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐలా పాలకవర్గ సభ్యులు, యెస్.టి.యస్ కె.ఉమా మహేశ్వర రావు, వాసవ్య మహిళా మండలి సిబ్బంది డాక్టర్ ఆర్. స్వర్ణలత, కె.శ్రీనివాసరావు, వి. రాజామోహన్ రావు, ఎ.సత్యప్రసాద్, డి.వీరాంజనేయులు, యస్.కె.ఫిరోజ్ బాషా. కృష్ణారెడ్డి, రమాదేవి, సాయి దుర్గారావు, కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ ఆశోసియేషన్ సిబ్బంది వై.రాయప్ప, అంకారావు, కె. శిషుకుమార్, ఎ.ప్రసాద్, యం.గణేష్ మరియు పీర్ ఎడ్యుకేటర్లు బలరాము. గిరిబాబు. కె.వి కృష్ణారావు, వి.తాతారావు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News