విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రక్షకుడు పుట్టిన దినమే క్రిస్మస్ పర్వదినం. క్రిస్మస్ పండుగని పురస్కరించుకుని ప్రజలు భక్తి శ్రద్ధలతో ఆనందంగా జరుపుకోవాలని, విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని పాదుగొల్పాలి. ఈ క్రిస్మస్ మానవాళి జీవితాల్లో ప్రేమ, శాంతి నింపాలని డ్రీమ్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు, ఎపి ఎంఆర్పిఎస్ రాష్ట్ర కన్వీనర్ మేదర సురేష్కుమార్ ప్రకటనలో తెలిపారు. త్యాగం, ప్రేమ, కరుణ గొప్పతనాన్ని ఏసుక్రీస్తు తన బోధనలు ద్వారా విశ్వ మానవాళికి తెలియచేసారనీ, యేసుక్రీస్తు గొప్ప శాంతి దూత, కరుణామయుడు అని, క్రైస్తవ సోదర సోదరీమణులు అందరూ క్రిస్మస్ వేడుకలను ఘనంగా, ఆనందోత్సాహల మధ్య ఆనందంగా జరుపుకోవాలని తెలిపారు. దేవాది దేవుడు, కరుణామయుడు, లోక రక్షకుడు అయిన ఏసుక్రీస్తు చూపిన ప్రేమ, అనురాగాలు సమాజంలోని ప్రజల మనగడ, జీవన శైలికి ఎంతో అవసరం అని పేర్కొన్నారు. మనిషికి మనిషికి అంతరం పెరిగిపోతున్న నేటి సమాజంలో ప్రేమ, సహనం, ఓర్పు వంటి అంశాలతో దగ్గరయ్యేందుకు ఏసుప్రభువు ప్రవచనాలు మాత్రమే ఉపయోగపడతాయన్నారు. దుష్టులను సహితం క్షమించడంతో పాటు తనను శిలువుని ఎక్కించిన వారిని సైతం క్షమించిన మహానుభావుడు ఏసుప్రభువు అన్నారు. సమాజ శాంతి కొరకు ప్రబోధించిన మహనీయులు ఏసుప్రభు అని అన్నారు. ఆ ఏసుప్రభు వారి ఆశీస్సులు చల్లని దీవెనలు ప్రజల మీద ఉండాలని కోరుకుంటూ క్రైస్తవ సోదరీ సోదరీమణులందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
Prajavartha Online Telugu News