-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భవాని దీక్షల విరమణ ఆఖరి రోజు కావడం వల్ల భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నందున విఎంసి సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉంటూ వారు చేస్తున్న పనులను వేగవంతం చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. మంగళవారం రాత్రి ఒంటి గంటకు భవాని దీక్ష విరమణ ఏర్పాట్లను కృష్ణవేణి ఘాట్, సీతమ్మ పాదాలు, హోల్డింగ్ ఏరియా, వినాయకుని గుడి, కెనాల్ రోడ్, దుర్గా ఘాట్, మోడల్ గెస్ట్ హౌస్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భవాని దీక్ష విరమణకు వచ్చిన భక్తులందరూ ఎక్కువ శాతంతో ఉండటంతో రాత్రి వేళలో విఎంసి సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ చేస్తున్న పనిని వేగవంతంగా చేసి భక్తులందరికీ ఎటువంటి లోపం లేకుండా చేసుకోవాలని అన్నారు. భవాని దీక్ష విరమణ లో భక్తులు తీసే దుస్తులను ఎప్పటికప్పుడు కన్వేయర్ బెల్ట్ ద్వారా తీసివేయాలని, అవసరమైతే కన్వర్ బెల్ట్ ద్వారా తీసిన దుస్తులను వేసే ట్రక్కులను పెంచమని అధికారులను ఆదేశించారు.
భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల త్రాగునీటి సరఫరా లో ఎటువంటి అంతరాయం లేకుండా, భక్తుల రద్దీగా ఉండటం వల్ల త్రాగునీటిని స్టాక్ పాయింట్ నుండి వాటర్ పాయింట్ వరకు రవాణా చేసేటప్పుడు ఇంకొంచెం సమయం పడుతుంది కాబట్టి ముందుగానే అప్రమత్తంగా ఉంటూ ఆ రవాణా సమయం ఎంత పడుతుందో దానికి అనుగుణంగా ప్రణాళికను సిద్ధం చేసుకుని త్రాగునీటి ప్యాకెట్లను, బాటిల్లను ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. దుర్గా ఘాట్ వద్ద గల మోడల్ గెస్ట్ హౌస్ లో ఉన్న కంట్రోల్ రూమ్ లో ఉండే సీసీ కెమెరాలు మరియు డ్రోన్ కెమెరా ద్వారా జరుగుతున్న పనిని, అధికారులను, సిబ్బందిని పరిరక్షించి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
Prajavartha Online Telugu News