గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నీతి నిజాయితీలతో 10 ఏళ్ల పాటు దేశ ప్రధానిగా, ఆర్ధిక మంత్రిగా భారత దేశ ఆర్ధిక వృద్దికి విశేష కృషి చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ కి భారత రత్న పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం అందించాలని నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు కోరారు. శనివారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో అదనపు కమీషనర్ చల్లా ఓబులేసు అధ్యక్షతన జరిగిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సంతాప సభలో మేయర్ కావటి శివ నాగ మనోహ నాయుడు , ప్రత్తిపాడు యం.యల్.ఎ బూర్ల రామాంజనేయులు , వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, నగర పాలక సంస్థ విభాగాధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, భారత దేశం గర్వించదగిన మహోన్నత ఆర్ధికవేత్త మన్మోహన్ సింగ్ మరణం తీరని లోటని, వారి కుటుంబానికి గుంటూరు నగర పాలక సంస్థ మరియు ప్రజల తరుపున ప్రగాడ సానుభూతిని తెలియచేస్తున్నామన్నారు. పార్టీలకు రాజకీయాలకు అతీతంగా అందరి మన్ననలు పొందిన దేశ నేతల్లో మన్మోహన్ సింగ్, వాజ్ పేయి లు ముందు పీటిన ఉంటారన్నారు. ప్రపంచ దేశాలకు దీటుగా భారత దేశ ఆర్ధిక వ్యవస్తను నిలబెట్టిన మన్మోహన్ సింగ్ ప్రజ్ఞాపాటవాలు సదా స్మరనీయమని అన్నారు. యం.యల్.ఏ మాట్లాడుతూ, యావత్ జాతి గర్వించదగిన నేత మన్మోహన్ సింగ్ మరణం తీరని లోటన్నారు. చారిత్రాత్మక నిర్ణయాలతో భారత ఆర్ధిక వ్యవస్తను గాడిలో పెట్టిన మేధా సంపన్నులని అన్నారు. అతి చిన్న వయసులో రాజకీయాలకు సంబంధం లేకుండా ఆర్ధిక మంత్రి బాధ్యతలను నాటి ప్రధాని పి.వి నరసింహారావు అప్పగించడమే మన్మోహన్ సింగ్ ప్రతిభాపాటవాలకు నిదర్శనమన్నారు. అదనపు కమీషనర్ మాట్లాడుతూ, ఆర్ధిక సంస్కరణలను అమలు చేయడంలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించి, భారత ఆర్ధిక వ్యవస్తకు నూతన ఉత్తేజం కలిగించారని కొనియాడారు. అనంతరం వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, అధికారులు మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. తొలుత మేయర్, యం.యల్.ఎ, కార్పొరేటర్లు, అధికారులు మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి, 2 నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు. సదరు కార్యక్రమంలో డిప్యూటి కమీషనర్ సి.హెచ్ శ్రీనివాస్, యస్.ఈ నాగామల్లెశ్వర రావు, సి.పి రాంబాబు, సి.యం.ఓ.హెచ్ డాక్టర్ శోభారాణి, కౌన్సిల్ సెక్రటరీ పి. శ్రీనివాసరావు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News