కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పట్టిసీమ – కొవ్వూరు జాతీయ రహదారి 365 బీబీ మార్గాన్ని అభివృద్ది కోసం క్షేత్ర స్థాయిలో ప్రాథమిక సర్వే చేపట్టడం జరిగిందని రెవిన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత తెలిపారు. శనివారం సాయంత్రం పట్టిసీమ కొవ్వూరు మార్గంలో భూసేకరణ సంబంధించి ఇరిగేషన్, జాతీయ రహదారులు, రెవిన్యూ అధికారులతో కలిసి వీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీవో రాణి సుస్మిత వివరాలు తెలియ చేస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇటీవల పోలవరం ప్రాజెక్టు పరిశీలన చేసిన సందర్భంలో పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి జాతీయ రహదారి మార్గాన్ని అనుసంధానం చెయ్యాలని పేర్కొనడం జరిగింది తెలిపారు. ఆమేరకు కొవ్వూరు వరకూ 4 రోడ్ల రహదారి మార్గం అందుబాటులోకి తీసుకుని రావడం పై సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక అందచేయాలని కలెక్టరు ను ఆదేశించినట్లు తెలిపారు. జాతీయ రహదారులు అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు విజయవాడ నుంచి వచ్చి అనుకూలత, తదితర అంశాల గురించి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో 365 బిబి జిలుగుమిల్లి జాతీయ రహదారి మార్గం కు పట్టిసీమ కొవ్వూరు మార్గాన్ని అనుసంధానం చెయ్యడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యం అని పేర్కొన్నారు. ఏ ఏ ప్రాంతాలలో భూసేకరణ చెయ్యాల్సి ఉంటుంది, ప్రభుత్వ స్థలాలు, ఇరిగేషన్ పరంగా కావలసిన అనుమతులు తదితర అంశాలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ రహదారులు ఈ ఈ సంజీవ రెడ్డి, ఇరిగేషన్ గోదావరీ హెడ్ వర్క్స్ ఈ ఈ ఆర్. కాశీ విశ్వేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News