-భారత ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన, శుచి శుభ్రమైన ఆహారం అందించే లక్ష్యంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) పని చేస్తోంది:కేంద్ర ఆయుష్, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తినుబండారాల విక్రయదారులు మరియు వీధి విక్రయ వ్యాపారులు అమ్మే ఆహార పదార్థాలు కల్తీ లేని, శుచికరమైన ఆహారం అందించాల్సిన బాధ్యత ఉందని, భారత ప్రభుత్వం వీధి విక్రయ వ్యాపారులకు అండగా కార్యక్రమాలు చేయబడుతోందని భారత ప్రభుత్వ ఆయుష్, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ వీధి వ్యాపారులను, ఎఫ్.బి.ఓ లను ఉద్దేశించి పేర్కొన్నారు.
ఆదివారం ఉదయం స్థానిక తిరుపతి కలెక్టరేట్ నందు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) (Food Safety and Standards Authority of India (FSSAI) భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ ఆహార భద్రత ప్రమాణాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆహార భద్రత, ప్రమాణాలపై తినుబండారాల చిరు వ్యాపారులు మరియు వీధి వ్యాపారులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ ప్రసిద్ధ తిరుమల శ్రీవారు కొలువైన తిరుపతి పుణ్య క్షేత్రం నందు వీధి వ్యాపారుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందనీ తెలుపుతూ భారత దేశంలో అమృత్ కాల్ సమయం గౌ. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీజీ నాయకత్వంలో కొనసాగుతోందనీ అన్నారు. ప్రాజెక్ట్ క్లీన్ స్ట్రీట్ ఫుడ్ ఇనిషియేటివ్ లో భాగంగా ప్రజలకు శుచికరమైన, నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యంగా వీధి వ్యాపారులకు, చిరు వ్యాపారులకు కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాలు చేపట్టి వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ప్రజలు తీసుకునే ఆహారం శుచి శుభ్రత కలిగి, నాణ్యతగా ఉండేలా దేశవ్యాప్తంగా 100 స్ట్రీట్స్ ఫుడ్ హబ్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందనీ, అందులో నాలుగు కడప, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించడం జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారులకు, వీధి విక్రయదారుల ఉన్నతికి అండగా అన్ని విధాలా కృషి చేస్తోందని అన్నారు. ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యతగా శుచికరమైన, నాణ్యమైన ఆహారం విక్రయించాలని వ్యాపారులను కోరారు. తినుబండారాల వీధి వ్యాపారులు, స్ట్రీట్ వెండర్స్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకుని, లైసెన్సు పొందాలని సూచించారు. రిజిస్ట్రేషన్ కు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నవారికి, గతంలో ఉన్న 100 రూపాయల ఫీజును కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసి ఉచితం చేసిందని అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ కింద తిను బండారాలు అమ్మే చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు పిఎం స్వానిధి వినియోగించుకుని స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని కోరారు. బ్యాంకులు వాటికి సహకరించాలి అని కోరారు.
అనంతరం కేంద్ర సహాయ మంత్రి శిక్షణ పొందుతున్న తినుబండారాల చిరు వ్యాపారులు మరియు వీధి వ్యాపారులతో ముఖా ముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి గ్రూప్ ఫోటోలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సౌత్ రీజినల్ డైరెక్టర్ శ్రీ పంచమ్, జాయింట్ ఫుడ్ కంట్రోలర్ ఐపిఎం ఆంధ్రప్రదేశ్ ఎన్.పూర్ణచంద్రరావు, తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ బాలు నాయక్, తిరుపతి జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, తిరుపతి అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వెంకటేశ్వరరావు, ట్రైనర్ డా. ఆంజనేయులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు మద్దిలేటి, జగదీష్, నర్మద తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News