విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమార్థం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని.. అర్హులైన ప్రతిఒక్కరూ వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో 100 మంది పేద బ్రాహ్మణులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మల్లాది విష్ణు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ అక్షయపాత్ర ఫౌండేషన్ సేవలను కొనియాడారు. తొలి ఏకాదశి పర్వదినాన కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద బ్రాహ్మణులను ఆదుకోవడం అభినందనీయమన్నారు. అక్షయ పాత్ర తమ సేవలను మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ తమకు ఉన్నంతలో పేదలకు సహాయసహకారాలు అందించి దానగుణాన్ని చాటుకోవాలని కోరారు. కార్యక్రమంలో 58వ డివిజన్ కార్పొరేటర్ అవుతు శ్రీశైలజ శ్రీనివాసరెడ్డి, వికలాంగుల హక్కుల సాధన సమితి జాతీయ అధ్యక్షులు బందెల కిరణ్ రాజు, అక్షయ పాత్ర ఫౌండేషన్ ఉపాధ్యక్షులు వంశీధరదాస మరియు విలాస విగ్రహ దాస, అక్షయ పాత్ర ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
వరద బాధితులకు విరాళాల వెల్లువ
-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …