విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇండియన్ బ్యాంకు జోనల్ మేనేజర్ కెవి రాజశేఖర్ రావు జిల్లా కలెక్టర్ జె. నివాస్ ను మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందజేశారు. మంగళవారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో బ్యాంకు అధికారులు కలసిన సమయంలో కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్ హెల్టా గ్రూప్ సభ్యులకు మంజూరైన ఇళ్ల నిర్మాణానికి ఇతోధికంగా రుణాలు అందించాలని కోరారు. జిల్లాలో వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో పక్కా ఇళ్ల నిర్మాణం ముమ్మరంగా సాగుతుందన్నారు. ఈ నేపథ్యంలో లబ్దిదారుల్లో స్వయంసహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారు సుమారు 70వేల మంది ఉ న్నారన్నారు. వీరందరు త్వరితగతిన ఇళ్ల నిర్మించుకునేందుకు బ్యాంకర్ల సహాయం అవసరం అన్నారు. ఈ మేరకు ఇండియన్ బ్యాంకు జోనల్ మేనేజర్ కెవి రాజశేఖర్ రావు స్పందిస్తూ ఇందుకు తమ పూర్తి సహకారం అందిస్తామన్నారు. కానూరు లోని ఇండియన్ బ్యాంక్ మైక్రోశాట్ బ్రాంచి ద్వారా ఈ నెల 27వ తేదిన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 3 వేల మందికి 15 కోట్లు రుణాలు అందించేందుకు కార్యక్రమం రూపొందిస్తున్నమన్నారు. కలెక్టర్‌ను కలసిన వారిలో ఎల్ డియం ఆర్ రామోహన్ రావు, ఇండియన్ మైక్రోశాట్ విజయవాడ బ్రాంచ్ మేనేజర్ జి. రాంబాబు తదితరులు ఉన్నారు.
