విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
60వ డివిజన్ వాంబే కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కృష్ణ హోటల్ సెంటర్ వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సుప్రీమ్ వారి సౌజన్యంతో Ln.వి.అప్పలరాజు జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా కరోన కష్ట కాలంలో ఉన్న ప్రజలకు బియ్యము, చీరలు మరియు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. రామరాజు మాట్లాడుతూ ప్రతీనిత్యం సేవా కార్యక్రమాలు చేస్తున్న అప్పలరాజు ని అభినందిస్తూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరారు. అప్పలరాజు మాట్లాడుతూ కోవిడ్ కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సేవలు అందించి వారి ఆరోగ్యం పట్ల చూపించిన శానిటరీ సిబ్బందికి చిరు సత్కారం చేయటం జరిగిందినిరంతరంగా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తున్న కు లయన్స్ క్లబ్ తరుపున మొమెంటోతో సత్కరించటం జరిగింది.ముఖ్య అతిధులుగా Ln. డి.వి.యెస్. రామలింగరాజు (ప్రెసిడెంట్) , Ln. ఎ. కుసుమ (సెక్రెటరీ), Ln.శ్రీనివాసరెడ్డి (కోశాధికారి) పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వాంబే కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు రామరాజు, కంచి ధన శేకర్, రైల్వే ప్రసాద్, డివిజన్ కార్పొరేటర్ కంచి దుర్గ నాయకులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
నీతి ఆయోగ్ సీఈఓను కలిసిన రాష్ట్ర మంత్రి టి.జి భరత్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి …