రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక క్షేత్ర స్థాయిలో పరిష్కారం లభించే అర్జీ దారులు వ్యయ ప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి రావడం గమనించనట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన పి జి ఆర్ ఎస్ లో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, డీ ఆర్వో టి సీతారామ మూర్తి, సిపివో ఎల్. అప్పలకొండ, డిఎల్డివో లు రాజమండ్రీ పి. వీణా దేవి, కొవ్వూరు శ్లివారెడ్డి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పీజీ ఆర్ ఎస్ లో 120 అర్జీలు స్వీకరించడం జరిగిందనీ, వాటిలో రెవిన్యూ 65 , పి ఆర్ 19 , పురపాలక 14, ఇతర శాఖలకు చెందిన అర్జీలు 22 ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లా కేంద్రంలో వస్తున్న అర్జీలలో ఎక్కువ అర్జీలు క్షేత్ర స్థాయిలో పరిష్కారం లభించే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి ప్రజల నుంచి వస్తున్న అర్జీలకి పరిష్కారం లభించే అవకాశం ఉందని, ఆమేరకు ప్రజల్లో చైతన్యం తీసుకుని రావడం జరగాలని కలెక్టరు ఆదేశించారు. గ్రామ స్థాయిలో ప్రజలకి ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్థానికంగా ఉండే మండల కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ లో అందచేయాలని తెలియ చేయండి అని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి శాఖల వారీగా టేబుల్స్ ఏర్పాటు చేసి, ఆయా జిల్లా అధికారి వద్దకి నేరుగా ఫిర్యాదు దారుడునీ పంపి సమస్యను వ్యక్తిగతంగా వివరించే వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అప్పటీకే పలుసార్లు అర్జీ దారుడు వొచ్చి సమస్య పరిష్కారం కానీ ఎడల నేరుగా సంబంధిత అధికారులు నుంచి వివరణ తీసుకోవడం జరుగుతుందని కలెక్టరు ప్రశాంతి తెలిపారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు జిల్లా లో డైరెక్టు గ్రీవియన్స్ విధానంలో మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా, జవాబు దారీతనం పెంచడానికి జిల్లా యంత్రాంగం తరపున అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
స్వీకరించిన కొన్ని అర్జీలు:
రాజమండ్రీ అర్బన్ గంగనమ్మ నగర్ కి చెందిన రెడ్డి మారయ్య.. రెండు సంవత్సరాలు వృద్యాప పెన్షన్ నిలుపుదల చేయడం జరిగింది తెలిపారు. సంబంధిత ఫిర్యాదు దారుని పేరు మీద మూడు విద్యుత్ కనెక్షన్లు ఉండడం, 1100 చరదపు అడుగుల నివాస గృహం వలన పెన్షన్ నిలుపుదల చేసి నట్లు అధికారులు తెలిపారు. పిల్లలకి ఆస్తి పంపిణి చెయ్యడం జరిగిందని , విద్యుత్ కనెక్షన్లు మార్పు చేసుకోవాలని అధికారులు తెలిపారు. కడియం , కడియపు లంక కి చెందిన కట్టమూరి లక్ష్మీ గాయత్రి 195/5 సర్వే నెంబర్ లో ఉన్న భూమి ఆక్రమణకు గురి అయిందని తగిన న్యాయం చేయాలని కోరడం జరిగింది. సంబంధిత తహసిల్దార్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సోమవారం తీసుకున్న ఆర్జీలలో రేషన్ కార్డు లో పేర్లు మార్పు, వీల్ చైర్, 35 కేజీల అంత్యోదయ రేషన్ కార్డు 35 కేజీల బియ్యం, భూ సర్వే, ఆక్రమణలు, డ్వాక్రా మహిళల సంఘం రుణాలను దుర్వినియోగం చేయడంపై తదితర అంశాలపై అర్జీలు ఇవ్వడం జరిగింది.
Prajavartha Online Telugu News