Breaking News

ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ అమలు భేష్‌..

-సుపరిపాలన లక్ష్యంగా అందిస్తున్న మెరుగైన సేవలు..
-ఆర్జీల పరిష్కారంలో నాణ్యతకు ప్రాధాన్యం..
-దీర్ఘకాల భూ సమస్యలకు రెవెన్యూ సదస్సుల్లో పరిష్కారం..
-కేంద్ర డిప్యూటీ సెక్రటరీ పార్థసారథి భాస్కర్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో అమలవుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ సదస్సుల ద్వారా సమస్యలను పరిష్కరించి సుపరిపాలన అందించడం అభినందనీయమని డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ రిఫార్మ్స్‌, పబ్లిక్‌ గ్రీవెన్స్‌ డిప్యూటీ సెక్రటరీ పార్థసారథి భాస్కర్‌ అన్నారు.

దేశవ్యాప్తంగా ఈనెల 19 నుంచి 24 వరకు నిర్వహిస్తున్న సుపరిపాలన వారోత్సవాలలో భాగంగా ‘‘ప్రశాసన్‌ గావ్‌ కి ఓర్‌’ ప్రచార కార్యక్రమంలో భాగంగా జిల్లాలో అమలు జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కారానికి సంబందించిన విధానాలను పరిశీలించడంలో భాగంగా కేంద్ర పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం డిప్యూటీ సెక్రటరీ పార్థసారథి భాస్కర్‌ శనివారం నగరంలోని కలెక్టరేట్‌ వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశతో సమావేశం అయ్యారు. సుపరిపాలన లక్ష్యంగా, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తూ ప్రభుత్వ పరంగా మెరుగైన సేవలు అందించడం అభినందనీయమని కేంద్ర డిప్యూటీ సెక్రటరీ పార్థసారథి భాస్కర్‌ అన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం, పౌరులకి మెరుగైన సుపరిపాలన అందించడంలో భాగంగా ప్రతీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను (పిజిఆర్‌ఎస్‌) నిర్వహిస్తూ, జవాబుదారీతనం ఉండేలా సుపరిపాలన అందిసున్నామన్నారు. జిల్లాలో నిర్వహించే పిజిఆర్‌ఎస్‌ విభాగంలో రిసెప్షన్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ కౌంటర్‌, రిజిస్టేషన్‌ కౌంటర్లతో పాటు ప్రత్యేకంగా విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్దుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతీ సోమవారం నిర్వహించే పిజిఆర్‌ఎస్‌ తో పాటు అన్‌లైన్‌, ముఖ్యమంత్రి ప్రజా వేదిక, కాల్‌ సెంటర్‌, పిజిఆర్‌ఎస్‌ ఇ`మెయిల్‌, తదితర మార్గాల ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 16,806 ఆర్జీలను స్వీకరించగా వీటిలో 13,000కు పైగా పరిష్కరించడం జరిగిందన్నారు. వీటితో పాటు దీర్ఘాకాలంగా ఉన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నాయన్నారు. దీనిలో భాగంగా జిల్లాలోని 323 రెవెన్యూ గ్రామాలలో ఈనెల 6 తేది నుండి 2025 జనవరి 8 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సదస్సులలో సంబంధిత తహాశీల్థార్‌, సర్వేయర్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, విఆర్‌వో హాజరై గ్రామాలకు సంబంధించిన రెవెన్యూ రికార్డులతో అక్కడిక్కడే రెవెన్యు సమస్యలను పరిష్కరిస్తున్నారన్నారు. ఇప్పటికే 172కు పైగా సదస్సులు పూర్తి చేశామని సదస్సులకు 11,304కు పైగా ప్రజలు హాజరై తమ సమస్యలను పరిష్కరించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 605 గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రధాన శాఖలకు సంబంధించి 463 ప్రభుత్వ సేవలను స్థానికంగా ప్రజలకు చేరువ చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ కేంద్ర పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం డిప్యూటీ సెక్రటరీ పార్థసారథి భాస్కర్‌కు వివరించారు.

రెవెన్యూ సదస్సులలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించిన తీరును వివరిస్తూ విజయవాడ డివిజన్‌ రూరల్‌ మండలంలోని గూడవల్లిలో 15 సంవత్సరాలుగా జొన్నలగడ్డ మంగపతి, ఇతర రైతులకు సంబంధించి పరిష్కారం కాని దారి మార్గం వివాదాన్ని, నున్న గ్రామంలో 19 సంవత్సరాలుగా ఉన్న భుక్యా మంగా బాయి సమస్యకు సంబంధించి సరిహద్దులను పరిష్కరించి 21.11 ఎకరాల లబ్దిని చేకుర్చామని, పాతపాడుగ్రామంలో 18 సంవత్సరాలుగా బొల్లడ్ల రవి, గ్రామస్తులకు సంబంధించి వివాదాంగా ఉన్న స్మశానం సరిహద్దు సమస్యను, ఆదే గ్రామంలోని గత రెండు సంవత్సరాలుగా భీమిరెడ్డి శంకర్‌రెడ్డి ఇతరుకు సంబంధించి వివాదాంగా ఉన్న సరిహద్దు సమస్యను పరిష్కరించినట్లు జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ కేంద్ర డిప్యూటీ సెక్రటరీ పార్థసారథి భాస్కర్‌కు వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారం, పౌరులకి మెరుగైన సుపరిపాలన అందించే క్రమంలో గత ఐదు సంవత్సరాలుగా 2019-24 కాలంలో ‘‘ ప్రశాసన్‌ గావ్‌ కి ఒరే’’ కార్యక్రమాన్ని చేపట్టి ఈనెల 19 నుంచి 24 వరకూ ప్రశాసన్‌ గావ్‌ కి ఒరే క్యాంపెయిన్‌ మరియు గుడ్‌ గవర్నెన్స్‌ వీక్‌ విజయవంతంగా నిర్వహిస్తున్నామని కేంద్ర డిప్యూటీ సెక్రటరీ పార్థసారథి భాస్కర్‌ అన్నారు.

తొలుత విజయవాడ రూరల్‌ గూడవల్లి సచివాలయం`1ను కేంద్ర డిప్యూటీ సెక్రటరీ పార్థసారథి భాస్కర్‌ సందర్శించి సచివాలయం ద్వారా అందుతున్న సేవలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

సమావేశంలో గ్రామ వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి పి. జ్వోతి, లైజన్‌ ఆఫీసర్‌ రామకృష్ణ ఉన్నారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *