Breaking News

ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలను పండుగ నిర్వహణకు అధికారులు అందరూ సమన్వయంతో పనిచేయాలి…

జిల్లాలో రానున్న జనవరి 2025 నెలలో మూడు రోజుల పాటు నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహణకు అధికారులు అందరూ సమన్వయంతో పనిచేయాలి: జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :

రానున్న జనవరి 2025 నెలలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని, సంబంధిత శాఖల అధికారులు వారి విధులను, ఏర్పాట్లను పక్కాగా నిర్వహించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు.

శనివారం మధ్యాహ్నం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు జనవరిలో నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకల నిర్వహణపై జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మరియు జూ క్యూరేటర్ సెల్వం, పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ డా.రమణ ప్రసాద్ లతో కలిసి సంబంధిత అధికారులతో వర్చువల్ విధానంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా పర్యాటక కమిటీ చైర్మన్ హోదాలో సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ను గౌ. ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఘనంగా పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఆదేశించారని ఘనంగా నిర్వహించడానికి అన్ని సన్నాహాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ ఉత్సవం గురించి సోషల్ మీడియా తదితర వేదికల ద్వారా రాష్ట్ర దేశ ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులకు చేరేలా విస్తృత ప్రచారం చేయాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ వర్గాల వారిని పలువురిని భాగ స్వామ్యం చేసి ఘనంగా పండుగ వాతావరణంలో ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ను నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ ముంబై, శ్రీ సిటీ వంటి తదితరులను కూడా భాగస్వామ్యం చేయడం జరుగుతున్నదనీ అన్నారు. ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 నిర్వహణ ఐదు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నామని నేలపట్టు పక్షుల అభయారణ్యం, అటకానితిప్ప షార్ సమీప రహదారిలో, బీవీ పాలెం పులికాట్ సరస్సు, ప్రభుత్వ జూనియర్ కళాశాల సూళ్లూరుపేట, శ్రీ సిటీ ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుందని, వివిధ కార్యక్రమాల నిర్వహణ ఉంటుందని కలెక్టర్ తెలిపారు. సదరు ప్రాంతాలలో ఇంచార్జి అధికారులను ఏర్పాటు చేయడం జరుగుతుందని విస్తృతమైన ఏర్పాట్లపై అధికారులకు సిబ్బందికి విధుల కేటాయింపు ఉంటుందని తెలిపారు. ఇందు కొరకు సదరు ఉత్సవాలు నిర్వహించే ప్రాంతాలలో రహదారుల మరమ్మత్తులు, పరిశుభ్రత, వేదిక ఏర్పాటు, బందోబస్తు, త్రాగు నీరు, మీడియా, మెడికల్ క్యాంపు ఏర్పాట్లు, అగ్నిమాపక శాఖ వారు ఫైర్ సేఫ్టీ, ప్రోటోకాల్ తదితర ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు పక్కా ప్రణాళిక తయారుచేసి అధికారులకు విధులు కేటాయించడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే మత్స్య శాఖ అధికారులు పులికాట్ సరస్సు నందు బోటు ప్రయాణానికి అవసరమైనన్ని బోట్లు, ట్రిప్పులు ఎన్ని నిర్వహిస్తారు అని ప్రణాళిక ఏర్పాటు, విధుల కేటాయింపు, లైఫ్ జాకెట్లు, గజ ఈతగాళ్లు, రోప్ తదితర సామాగ్రి అందుబాటుతో ఎలాంటి ఓవర్ లోడ్ లేకుండా బోటు ప్రయాణంలో అన్ని రకాల జాగ్రత్తలు చేపట్టి, పర్యవేక్షించాలని మత్స్యశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సంబంధిత అధికారులు వారి శాఖకు చెందిన ప్రతిపాదనలు ఏమైనా ఉంటే త్వరితగతిన సమర్పించి ఆమోదం పొంది పనులు చేపట్టాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయి, డిఎఫ్ఓ, జిల్లా పర్యాటకశాఖ అధికారి జనార్దన్ రెడ్డి, ఏపీటీడీసి ఈఈ సుబ్రమణ్యం, డ్వామా పిడి శ్రీనివాస ప్రసాద్, జిల్లా మత్స్యశాఖ అధికారి నాగరాజు తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *