-“క్రమశిక్షణగా విధులు నిర్వర్తించినపుడే సంతృప్తి కలుగుతుంది”
-“సమస్యల పరష్కారం, సహోద్యోగుల శ్రేయస్సే ధ్యేయం. దొప్పలపూడి ఈశ్వర్”
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, APJAC అమరావతి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దొప్పలపూడి ఈశ్వర్ స్వచ్చంద పదవీ విరమణ చేసారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో అభినందన సన్మాన సభ జరిగింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేసి, విజయవాడ నగరపాలక సంస్థ ఉద్యోగులకు ఉద్యోగులకు 010 పద్దు క్రింద చేర్చడానికి ఈశ్వర్ యెనలేని కృషి చేశారు. APJAC అమరావతి అండదండలతో సాధించారు. సొసైటీని క్రమశిక్షణ నిర్వహించి ఉద్యోగులకు బరోసాగా నిలిపారు. మూడు దశాబ్దాలకు పైగా విజయవాడ నగరపాలక సంస్థలో సేవలందించి నేడు స్వచ్చంద పదవీ విరమణ చేసారు.
విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ అడుగిడినప్పటినుండి ఉద్యోగులకు అండగా నిలిచారు. వారి శ్రేయస్సే ధ్యేయంగా, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసారు. VMC ఎంప్లాయిస్ కో ఆపరేటివ్ బ్యాంకు నకు మూడు పర్యాయాలు ప్రెసిడెంట్ గా, ఇప్పటికీ డైరెక్టర్ గా సేవలందిస్తున్నారు. వీరి కాలం లోనే సభ్య ఉద్యోగులకు మట్టి ఖర్చులు, ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించారు. విజయవాడ నగరపాలక సంస్థ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కి 4 పర్యాయాలు ప్రెసిడెంట్ గాను, నాలుగు మార్లు జనరల్ సెక్రటరీ గాను పనిచేసారు. ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ మినిస్తీరియాల్ అసోసియేషన్ కు జనరల్ సెక్రటరీ గా పనిచేసారు. వీరి నేతృత్వంలో రాష్ట్రంలో గల 17 మున్సిపల్ కార్పొరేషన్ లను ఏకీకృతం చేసి ఆంధ్ర ప్రదేశ్ మునిసిపల్ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ 2023 సంవత్సరంలో ఆవిర్భవించింది ఈ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి విజయవాడ నగరపాలక సంస్థ కమీషనరు H.M.ధ్యానచంద్ర IAS, ముఖ్య అతిధిగా హాజరయ్యారు. వీరు మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ ఉద్యోగి తన విధులతో బాటు సహోద్యోగుల సంక్షేమం కొరకు అవిశ్రాంతంగా కృషి చేయడం అభినందనీయమని, ఇలాంటి ఉద్యోగి స్వచ్చందంగా పదవీ విరమణ చేయడం ఉద్యోగుల నాయకత్వానికి లోటని తెలిపారు.
ముఖ్య అతిధిగా APJAC అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర రావు మాట్లాడుతూ నిబద్దత కలిగిన ఉద్యోగ నాయకుడు ఈశ్వర్ వీరి సహకారం APJAC అమరావతి మరువలేనిది. APJAC అమరావతి కృష్ణ జిల్లాకు వీరు జిల్లా చైర్మన్ గా సేవలందించారు ప్రస్తుతం APJAC అమరావతికి ఆర్గనైజర్ గా సేవలందిస్తున్నారు. నమ్మకం, నిజాయితీ, కలగలసిన నాయకుడు ఈశ్వర్ అని కొనియాడారు.
ఆంధ్ర ప్రదేశ్ మునిసిపల్ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ విజయవాడ యూనిట్ అధ్యక్షులు తిమ్మసర్తి నాగేశ్వర రావు, ప్రధాన కార్యదర్శి సలీం అహ్మద్ మరియు VMC యూనిట్ ఆధ్వర్యంలో జరిగిన దొప్పలపూడి ఈశ్వర్ స్వచ్చంద పదవీ విరమణ అభినందన సన్మాన సభ కార్యక్రమంలో డాక్టర్ డి. చంద్రశేఖర్, అడిషనల్ కమీషనర్, ప్రాజెక్ట్స్, APJAC అమరావతి సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదర రావు, APJAC అమరావతి అసోసియేట్ చైర్మన్ ఫణి పేర్రాజు, ఆంధ్ర ప్రదేశ్ మునిసిపల్ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అక్కరబోయిన అప్పలరాజు, APJAC అమరావతి రాష్ట్ర మహిళా విభాగం ఛైర్ పర్సన్ పి. లక్ష్మి, విశిష్ట అతిధులుగా పాల్గొన్నారు.
APMESA అసోసియేషన్ ప్రెసిడెంట్ కే.శివరామప్రసాద్, ట్రేజరర్, రవి, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు APJAC అమరావతి రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీ జనరల్ పి విజయలక్ష్మి, APJAC అమరావతి ట్రెజరర్ సంగీతరావు, APMESA కార్యవర్గ సభ్యులు టి. నాగరాజు, శ్రీకాకుళం, విశ్వనాధరెడ్డి, కడప, గాలి సుధాకర్, తిరుపతి, మోహన్ గోపాల్, మచిలీపట్టణం, అమర్నాద్ రెడ్డి చిత్తూర్, s. వెంకట కృష్ణ, మంగళగిరి కే. కళ్యాణ చక్రవర్తి, VMC, ఎం. అప్పలరాజు, విజయనగరం, జాన్ పాల్ కాకినాడ, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని ఈశ్వర్ అభినందనలు తెలిపారు.
Prajavartha Online Telugu News