-14 దరఖాస్తుదారుల టిడిఆర్ బాండ్లపై సమగ్ర పరిశీలన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ప్రధాన కార్యాలయంలో గల తమ ఛాంబర్ లో మంగళవారం ఉదయం టి డి ఆర్ బాండ్స్ స్క్రుటినీ కమిటీ తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సర్కిల్ వన్ పరిధిలోగల భవానిపురం ప్రాంతంలోని పునమిఘాట్ వద్దగల ప్రాంతం, ఆంధ్రప్రభ కాలనీ రోడ్డు విస్తరణ, డోర్నకల్ రోడ్డు విస్తరణ, కార్ల మార్క్స్ రోడ్ విస్తరణ, సర్కిల్ 3 పరిధిలో గల ఎన్టీఆర్ సర్కిల్ నుండి యనమలకుదురు డొంక రోడ్డు విస్తరణ వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో టి డి ఆర్ బాండ్స్ కోసం అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా చేసుకున్న 14 దరఖాస్తుల గురించి సభ్యులు చర్చించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కమిటీ సభ్యులందరూ వచ్చిన దరఖాస్తులపై సమగ్ర విచారణ చేసి రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ప్రకారం గా ఉందా లేదా అని నిర్ధారించుకొని, మరొకసారి రికార్డ్స్ వెరిఫై చేసి, ప్రభుత్వం ఉన్న అనుమతులు కనుగుణంగా చర్యలు తీసుకోవాలని నిర్ధారించారు.
ఈ సమావేశంలో నార్త్ తాసిల్దార్ సూర్యారావు, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) విజయవాడ నగరపాలక సంస్థ జీ.సృజన, జాయింట్ సబ్ రిజిస్టర్ గుణదల నందేశ్వరరావు, డిప్యూటీ సిటీ ప్లానర్ విజయవాడ నగరపాలక సంస్థ చంద్రబోస్, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు రాంబాబు మోహన్ బాబు, ఇతర కమిటీ సభ్యులు, పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News