మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం పవిత్ర బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదర సోదరీ మణులకు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) శుభాకాంక్షలు తెలిపారు.‘త్యాగం, సహనం, ఐక్యమత్యానికి ప్రతీక బక్రీద్’ అని అన్నారు. పవిత్ర ఇస్లానిక్ గ్రంధాల ప్రకారం తన ప్రియమైన వస్తువును త్యాగం చేయమని దేవుడు చెప్పినప్పుడు ప్రవక్త అబ్రహం తన కుమారుడు ఇస్మాయిల్ ను త్యాగం(బలి) చేయడానికి సిద్ధపడతాడు. ఆయన త్యాగానికి మెచ్చిన అల్లాహ్ ప్రాణత్యాగానికి బదులు ఓ జీవాన్ని బలివ్వాలని సూచిస్తారు. అప్పటి నుంచి బక్రీద్ రోజున ఖుర్బానీ ఇవ్వడం ఆనవాయితీగా మారింది. ఇందుకోసం బలిచ్చిన జీవాన్ని మూడు భాగాలుగా చేసి ఓ భాగం పేదలకు, రెండో భాగం బంధువులకు, మరో భాగం తన కుటుంబం కోసం వినియోగిస్తారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు ఈ పండుగను ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారని తెలిపారు.ప్రజలందరికీ అల్లా ఆశీస్సులు ఎల్లప్పు డూ లభించాలని మంత్రి పేర్ని నాని ఆకాంక్షించారు. ముస్లిం సోదరసోదరీమణులకు బక్రీద్ శుభాకాంక్ష లంటూ ఆయన పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే మన దేశ గొప్పతన మని,కులమతాలకతీతంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. కాగా కోవిడ్ కారణంగా ఈ ఏడాది ఇళ్ళ లోనే పండుగను నిరాడంబరంగా జరుపుకోవాలని, ఖుర్బానీలకు బదులుగా పేదలకు సాయం చేయాలని ముస్లిం మతపెద్దలు సైతం పిలుపునిస్తున్నారని మంత్రి పేర్ని నాని తెలిపారు.
Tags machilipatnam
Check Also
వరద బాధితులకు విరాళాల వెల్లువ
-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …