-వైసీపీ శ్రేణులతో కోలాహలంగా మారీన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నూతన సంవత్సరం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా మరియు విజవాడ నగరం నుండి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు, దేవినేని అభిమానులు,శ్రేయోభిలాషులు దేవినేని అవినాష్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్శకులతో పార్టీ కార్యాలయం కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ అభిమానంతో తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు అని అన్నారు. మీ ప్రేమాభిమానాలు మా పై ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు మనందరికీ మంచి చేసిన ఈ వైసీపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికలలో ప్రజలు సంపూర్ణ మద్దతు తెలిపి మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి అండగా నిలవాలని అవినాష్ పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News