Breaking News

జనవరి 1 నుండి పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్ల స్వీకరణ : జిల్లా ఖజానా అధికారి లక్ష్మీకర్ రెడ్డి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్లను జనవరి ఒకటో తేదీ నుండి ట్రెజరీ కార్యాలయంలో స్వీకరిస్తామని జిల్లా ఖజానా అధికారి లక్ష్మీకర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షన్ దారులు ప్రతి సంవత్సరం కూడా జనవరి 1 నుండి ఫిబ్రవరి నెల ఆఖరు వరకు లైఫ్ సర్టిఫికెట్ డిజిటల్ పద్ధతిలో జీవన్ ప్రమాణ పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు అని, అందుకొరకు ఆధార్ కార్డు, సెల్ ఫోన్ నంబరు, పిపిఓ నంబరు (పింఛన్ పుస్తకం), బ్యాంకు ఖాతా వివరాలు తీసుకొని ట్రెజరీ కార్యాలయంలో గాని, మీసేవ కేంద్రం లో గాని, మరియు ఇంటర్నెట్ సెంటర్లో గానీ, పింఛన్ దారుల సంఘంలో గాని లైఫ్ సర్టిఫికెట్ నమోదు చేయించుకోవాలని సూచించారు. పెన్షనర్లకు సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా ట్రెజరీ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *