Breaking News

పర్యాటకాభివృద్ధిలో భాగంగా చేనేతకు చేయూతనిస్తామన్న మంత్రి కందుల దుర్గేష్

-రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను కలిసిన బీసీ సంక్షేమం, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత
-హస్తకళలు, చేనేతకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు పర్యాటక శాఖతో కలిసి నడుస్తామని మంత్రి సవిత విజ్ఞప్తి
-టూరిజం సర్క్యూట్ ల ఏర్పాటులో భాగంగా హ్యాండ్ లూమ్ క్లస్టర్ లను అభివృద్ధి చేయాలని, హస్తకళలకు ప్రాచుర్యం కల్పించాలని మంత్రి దుర్గేష్ ను కోరిన మంత్రి సవిత..సానుకూలంగా స్పందించిన మంత్రి కందుల దుర్గేష్
-రాష్ట్రంలో లేపాక్షి, ఆప్కో, చేనేత వస్త్రాల అమ్మకాలు పెరిగేందుకు తమ వంతు కృషి చేస్తామన్న మంత్రి దుర్గేష్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యాటకాభివృద్ధిలో భాగంగా పెద్ద ఎత్తున రాష్ట్రంలో టూరిజం సర్క్యూట్ లు ఏర్పాటు చేస్తున్న క్రమంలో అందులో భాగంగా హ్యాండ్ లూమ్ క్లస్టర్ ను అభివృద్ధి చేయాలని, హస్తకళలకు ప్రాచుర్యం కల్పించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ను బీసీ సంక్షేమం, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత కోరారు. గురువారం కేబినెట్ సందర్భంగా రాష్ట్ర సచివాలయానికి విచ్చేసిన మంత్రి కందుల దుర్గేష్ ను సచివాలయం రెండో బ్లాక్ మొదటి ఫ్లోర్ లోని ఛాంబర్ కు వెళ్లి మంత్రి సవిత మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సవిత చేనేత, జౌళి శాఖకు సంబంధించిన కొన్ని ప్రతిపాదనలను మంత్రి దుర్గేష్ కు వివరించారు. ఇటీవల కూటమి ప్రభుత్వం నూతన పర్యాటక పాలసీ 2024-29 ప్రకటించిన నేపథ్యంలో తదనుగుణంగా రాష్ట్రంలో టూరిజం సర్క్యూట్ లను అభివృద్ధి చేస్తోంది.. ఈ నేపథ్యంలో చేనేతకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు పర్యాటక శాఖతో కలిసి ముందుకు వెళ్లేందుకు సహకరించాలని మంత్రి సవిత కోరారు. ప్రధానంగా టూరిజం సర్క్యూట్ లలో భాగంగా సమీపంలోని హ్యాండ్ లూమ్ క్లస్టర్ ను అభివృద్ధి చేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అంతేగాక స్థానికంగా ఉండే హస్తకళలకు ప్రాచుర్యం కల్పించాలని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ ను కోరారు. తద్వారా నేతన్నలకు, హస్త కళాకారులకు అండగా నిలిచేందుకు ఉపకరిస్తుందన్నారు. అందుకు మంత్రి దుర్గేష్ సుముఖంగా స్పందించారు. హస్తకళలను, చేనేతను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్కకరిపైనా ఉందని మంత్రి దుర్గేష్ అన్నారు. రాష్ట్రంలో లేపాక్షి, ఆప్కో, చేనేత వస్త్రాల అమ్మకాలు పెరిగేందుకు తమ వంతు కృషి చేస్తామని మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మంత్రి కందుల దుర్గేష్ ను కలిసిన వారిలో హ్యాండ్ లుమ్స్ అండ్ టెక్స్ట్ టైల్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ కె. సునీత, ఐఏఎస్, చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖా రాణి, ఐఏఎస్, ఎండీ తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *