Breaking News

సావిత్రి భాయి పూలే కు ఘన నివాళి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ పిటిడి బీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ పి శేషగిరిరావు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. హెచ్ బి కాలనీ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్,ఎన్టీఆర్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ యేదుపాటి రామయ్య,42వ డివిజన్ టిడిపి అధ్యక్షులు ముదిరాజ్ శివాజీ పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎస్ పి శేషగిరిరావు మాట్లాడుతూ దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారని, మహిళల విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని భావించి పూణేలో మొదటి బాలికల పాఠశాలను ఏర్పాటుచేసి విద్యను అందించారని అన్నారు. ఆమె బోధనలు , ఉపన్యాసాలు మహిళలను చైతన్యపరిచేవన్నారు. నేటితరం మహిళలు సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం స్థానిక మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక నేతలు పీ నాగభూషణం, ఎవిఎస్ ఎన్ ప్రసాద్, దాసరి బుజ్జి, బి పూర్ణయ్య 47వ డివిజన్ జనసేన అధ్యక్షులు వేంపల్లి గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

26న విజయవాడలో సీపీఐ రౌండ్ టేబుల్‌కు ఆహ్వానం

-కరువుపై ఐక్య పోరాటాలు -పార్టీలకతీతంగా కేంద్ర, రాష్ట్రాలపై ఒత్తిడి పెంచాలి -ఖరీఫ్ రైతుల ఆందోళనకరం -55 లక్షల ఎకరాల్లో విత్తనాలే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *