మార్కెట్ నిర్మాణంపై మార్కెట్ వ్యాపారుల సంఘ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరానికి ఐకాన్ సింబల్స్ గా శంకర్ విలాస్ ఆర్ఓబి, పివికె నాయుడు మార్కెట్ ల నిర్మాణం జరగనున్నదని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. శుక్రవారం గుంటూరు పశ్చిమ ఎంఎల్ఏ గల్లా మాధవి తో కలిసి నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో పివికె నాయుడు మార్కెట్ నిర్మాణంపై మార్కెట్ వ్యాపారుల సంఘ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో పివికె నాయుడు మార్కెట్ షుమారు 152 కోట్లతో 8 అంతస్తులుగా నిర్మాణం చేయడానికి ప్రభుత్వం అనుమతి అనంతరం టెండర్ ప్రక్రియ కూడా ముగిసిందన్నారు. అతి త్వరలో పనులు ప్రారంభించడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు. మార్కెట్ నూతన భవనంలో గ్రౌండ్, మొదటి అంతస్తుల్లో షుమారు 307 మందికి స్టాల్స్ కేటాయించవచ్చని, వ్యాపారస్తుల సంఘ ప్రతినిధుల వినతి మేరకు ప్రస్తుతం ఉన్న 374 మందికి స్టాల్స్ కేటాయించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిఎంసి అధికారులు, వ్యాపారస్తుల సంఘ ప్రతినిధులతో మార్కెట్ నిర్మాణ పనుల పర్యవేక్షణకు కమిటిని కూడా చేస్తామని తెలిపారు. వ్యాపారస్తులు ఏ విధమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిర్మాణ సమయంలో వారు వ్యాపారాలు చేసుకోవడానికి వీలుగా ప్రత్యామ్నాయ స్థల సేకరణ చేస్తున్నామని, వారి దృష్టిలో ఉన్న స్థలాలు కూడా తెలిపితే పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఎంఎల్ఏ  మాట్లాడుతూ అందరికీ ఆమోదయోగ్యంగా, గుంటూరు నగరానికి మణిహారంగా పివికె నాయుడు మార్కెట్ నిర్మాణం జరుగుతుందన్నారు. ఎన్నికలకు ముందు మార్కెట్ లోని వ్యాపారులు మార్కెట్ నిర్మాణంపై తమ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని, నిర్మాణం చేయాలని తమ దృష్టికి తెచ్చారని, అందులో భాగంగా వ్యాపారస్తుల సంఘ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుతం వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కరికీ నూతన భవనంలో పారదర్శకంగా షాప్ కేటాయింపు జరుగుతుందన్నారు. పనులు ప్రారంభించిన 2 ఏళ్లలోపు పూర్తి చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, నిర్మాణ కాలంలో వ్యాపారాలు చేసుకోవడానికి ప్రత్యామ్నాయ స్థల సేకరణ జరుగుతుందని తెలిపారు.
అనంతరం మార్కెట్ వ్యాపారుల సంక్షేమ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లక్ష్మీ నారాయణ, శ్రీనివాస్ లు మాట్లాడుతూ మార్కెట్ నిర్మాణంకు తాము అనుకూలమేనని, గతంలో ఎన్నడూ లేని విధంగా తమతో సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలు, సమస్యలు తెలపడానికి అవకాశం కల్పించినందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం మార్కెట్ లోని 374 మంది వ్యాపారులకు నూతన నిర్మాణం చేసే భవనంలో షాప్ లు కేటాయించాలని, నిర్మాణ సమయంలో వ్యాపారాలు చేసుకోవడానికి అనువైన స్థలం జిఎంసి చూపాలని కోరారు.
సమావేశంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, టి.వెంకట కృష్ణయ్య, ఎస్.ఈ. నాగమల్లేశ్వరరావు, సిటి ప్లానర్ రాంబాబు, ఈఈలు సుందర్రామిరెడ్డి, కోటేశ్వరరావు, పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజక వర్గాల పునర్విభజన అధ్యయనానికి జనసేన కమిటీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన (డీ లిమిటేషన్) జరిగే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *