Breaking News

పారిశుధ్య పనులపై సమీక్షా సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో త్వరలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, పారిశుధ్య పనులను పిన్ పాయింట్ గా పర్యవేక్షణ చేస్తామని, వార్డ్ సచివాలయాల వారీగా శానిటేషన్ కార్యదర్శులు పారిశుధ్య పనుల పట్ల భాధ్యతవహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, సెక్రెటరిలతో ట్రేడ్ లైసెన్స్ లు, పారిశుధ్య పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూనగరంలో ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరిగేలా వార్డ్ సచివాలయాల ప్రాతిపదికన 802 మైక్రో ప్యాకెట్స్ ని రూపొందించామన్నారు. ప్రతి కార్యదర్శి తమ పరిధిలోని కార్మికులకు ప్రత్యేకంగా రిజిస్టర్ ఏర్పాటు చేసి, హాజరు, సెలవులు నమోదు చేయాలన్నారు. త్వరలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, ప్రతి సచివాలయం పరిధిలో జరిగే పారిశుద్య పనులను క్షుణ్ణంగా పర్యవేక్షణ చేస్తామన్నారు. ట్రేడ్ లైసెన్స్ ల డోర్ టు డోర్ సర్వే వివరాలు ప్రత్యేకంగా యాప్ లో అప్ లోడ్ చేయాలన్నారు. అలాగే వీధి కుక్కలను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం సచివాలయం పరిధిలో తీసుకెళ్లేప్పుడు, వదిలేప్పుడు తప్పనిసరిగా స్థానిక శానిటేషన్ కార్యదర్శి సంతకం తీసుకోవాలన్నారు. సెక్రెటరిలు లేని వార్డ్ సచివాలయాలకు శానిటరీ మేస్త్రీలను ఇంచార్జిలుగా నియమించాలని సిఎంఓహెచ్ ని ఆదేశించారు.
సమావేశంలో సిఎంఓహెచ్ డాక్టర్ పిజె అమృతం, ఎంహెచ్ఓ రవిబాబు, బయాలజిస్ట్ మధుసూదన్, విఏఎస్ వెంకటేశ్వర్లు, ఏఎంహెచ్ఓలు ఆనందకుమార్, రాంబాబు, శానిటరీ సూపర్వైజర్లు ఆయుబ్ ఖాన్, సోమశేఖర్, ప్రజారోగ్య విభాగ సూపరిండెంట్ పోలేశ్వరరావు, ఇన్స్పెక్టర్లు, సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *