Breaking News

నేషనల్ గేమ్స్ కి ఏపీ బాక్సర్లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఉత్తరాఖండ్లో నిర్వహించనున్న నేషనల్ గేమ్స్ కి రాష్ట్రం తరఫునుంచి ఇద్దరు క్రీడాకారులు ఎంపికైనట్లు ఆంధ్ర ప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ దేవ్ తెలిపారు. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన జాబితాలో హెవీ వెయిట్ విభాగంలో(86-92కేజీ ) శివ గణేష్ రెడ్డి( ప్రకాశం జిల్లా), హెవీ వెయిట్ విభాగంలో (92-92+ కేజీ) హేమంత్ కుమార్ రత్నం( శ్రీకాకుళం) లు ఎంపికైనట్లు చెప్పారు. సీనియర్ నేషనల్స్ లో క్వాలిఫైయింగ్ రౌండ్ కి అర్హత సాధించడం ద్వారా వీరిని నేషనల్ గేమ్స్ కి బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసినట్లు తెలియజేశారు. రాష్ట్రం నుంచి ఎంపికైన ఇద్దరు క్రీడాకారులను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ దేవ్ ప్రత్యేకంగా అభినందించి జాతీయ క్రీడల సైతం రాణించి రాష్ట్రానికి పేరు తీసుకురావాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *