విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల మాజీ సైనిక సంఘాలతో, నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ కమిటీతో, ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌సర్వీస్‌మెన్ వెల్ఫేర్ అసోసియేషన్‌తో, ఆంధ్రప్రదేశ్ మాజీ సైనికుల హక్కుల పోరాట సమితినీ కలుపుకుని ఆంధ్రప్రదేశ్ మాజీ సైనికుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఏర్పాటు చేయడం జరిగింది. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో నేషనల్ ఎక్స్ సర్వీస్‌మెన్ కో ఆర్డినేషనల్ కమిటీ (ఎన్‌ఈఎక్స్‌సిసి) జాతీయ ఉపాధ్యక్షులు ప్రముఖ పారిశ్రామికవేత్త కె.నాగరాజుని జేఏసీ ప్రెసిడెంట్ గానూ మరి కొంతమంది మెంబర్స్‌గా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిస్థాయి కమిటీని నియమించుకొనుటకు జేఏసీ ప్రెసిడెంట్‌కు పూర్తి బాధ్యత ఇచ్చారు. త్వరలోనే ఆ కమిటీని పూర్తి చేసి సంబంధిత అధికారులకు తెలియజేస్తారు. వివిధ సంఘాల నాయకులు అందరూ కూడా కొత్తగా ఎన్నికైనటువంటి నాగరాజుని మరియు కమిటీ సభ్యులను అభినందించారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌సర్వీస్‌మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అయినటువంటి మోటూరి శంకర్‌రావుని మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ సైనికుల హక్కుల పోరాట సమితి నుండి ఆ సంస్థ అధ్యక్షులు అయినటువంటి ఉడిమూడి రాజుని మరియు ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి అయినటువంటి కుచ్చుల పార్టీ కుమార్‌ని మెంబర్స్‌గా తీసుకున్నారు. వారందరూ కలిసి అందరూ సంఘాల నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. అందరి సహకారంతో ముందుకెళ్లి మన ప్రధాన డిమాండ్లను సాధించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసినారు ఇది చాలా బాధ్యతను గురుతర బాధ్యతగా భావించి సేవ చేసే భాగ్యం కలిగినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమమునకు పెద్దలు వెంకట అప్పారావు ప్రముఖ న్యాయవాదులు దేవర ఈశ్వరరావు, భోగేశ్వరావు, కోఆర్డినేషన్ కమిటీ జనరల్ సెక్రెటరీ పి.శ్రీనివాసరావు సమక్షంలో ఎన్నిక జరిగింది అని తెలియజేశారు.
Prajavartha Online Telugu News