Breaking News

కాపు మహిళల పాలిట వెలుగు రేఖ… ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ !


-రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా
-వైఎస్సార్‌ కాపు నేస్తం’ ద్వారా వరుసగా రెండో ఏడాది సాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
-జిల్లా వ్యాప్తంగా 11,059 మంది లబ్దిదారులకు రూ.16.58 కోట్లు విడుదల

కడప, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన “వైఎస్ఆర్ కాపు నేస్తం” పథకం.. కాపు మహిళల జీవితాల్లో వెలుగు రేఖలు నింపుతోందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా “వైఎస్ఆర్ కాపు నేస్తం” లబ్ధిదారుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున రెండవ విడత సాయం మొత్తాన్ని జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ విసి హాలునుండి జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ తోపాటు.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, జఖీయా ఖనం, రమేష్ యాదవ్, ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్ రెడ్డి, కడప నగర మేయర్ కె.సురేష్ బాబు, అడా ఛైర్మెన్ గురుమోహన్, సాగర కార్పొరేషన్ చైర్మన్ రమణమ్మ, జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) ధర్మ చంద్రారెడ్డిలు హాజరయ్యారు. ముఖ్యమంత్రి విసి ముగిసిన అనంతరం స్థానిక విసి హాలులో.. “వైఎస్ఆర్ కాపు నేస్తం” ద్వారా జిల్లా వ్యాప్తంగా 11,059 మంది లబ్దిదారులకు మంజూరయిన రూ.16,58,85,000/-ల మెగా చెక్కును గౌరవ అతిధులతో కలిసి.. జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్, జేసీ (ఆసరా, సంక్షేమం)లు లబ్ధిదారులకు అందజేశారు.

అనంతరం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హత ఉన్న ఏ ఒక్క నిరుపేద కూడా.. సంక్షేమ పథకాలకు దూరం కాకూడదనేదే.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు. ఆ దిశగా ముఖ్యమంత్రి అన్ని రకాల సంక్షేమ పథకాలను నిరంతరాయంగా కొనసాగిస్తూ వస్తున్నారన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ కాపునేస్తం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది కాపు మహిళల ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయన్నారు. గతంలో ముఖ్యమంత్రి తమ సుదీర్ఘ పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల సమస్యలు గుర్తించడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా దారిద్య్ర రేఖకు దిగువనున్న 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న అర్హులైన కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు వారి కుటుంబ ఆర్ధిక పరిస్థితిని మెరుగు పరుచుకునేందుకు గాను.. రూ.15 వేలను ప్రతి ఏడాది అందించే కార్యక్రమాన్ని గత ఏడాది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ప్రారంభించి రెండవ ఏడాది కూడా లబ్ది సాయం అందించడం జరిగిందన్నారు. కోవిడ్‌–19 లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయినప్పటికీ ఎన్నికల హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందడుగు వేస్తున్నారన్నారు. మహిళా సంక్షేమం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రికి అక్కచెల్లెమ్మల ఆశీస్సులు ఎల్లా వేళలా వుంటాయని ఆకాంక్షించారు. ఏవైనా కొన్ని కారణాల వల్ల “వైఎస్ఆర్ కాపు నేస్తం” ద్వారా లబ్ధి పొందలేక పోయిన వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో అవకాశాన్ని ఇచ్చారన్నారు. అర్హత ఉండి.. ప్రస్తుతం లబ్దిపొందలేక పోయిన వారు మరో నెల రోజుల గడువులోగా స్థానిక సచివాలయాల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ మాట్లాడుతూ “వైఎస్ఆర్ కాపు నేస్తం” ద్వారా అర్హులయిన బలిజ, కాపు, తెలగ, ఒంటరి .. సామాజిక వర్గ మహిళలు 100% లబ్ది పొందుతున్నారన్నారు. ఈ పథకం ద్వారా లబ్దిదారులకు జీవనోపాధితో పాటు వారి జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడుతున్నాయన్నారు.ఈ పథకం ద్వారా జిల్లాలో అర్హులయిన 11,059 మంది కాపు, బలిజ, తెలగ, ఒంటరి మహిళలకు ఒక్కొక్కరికి రూ.15,000లు చొప్పున రూ.16,58,85,000/-ల కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు. అర్హత ఉండీ లబ్ది చేకూరడంలో ఏమైనా సమస్యలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబరు : 1902 కు కాల్ చేయవచ్చన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఈడి డా.హెచ్. వెంకట సుబ్బయ్య, సంబందిత సంక్షేమ శాఖాధికారులు, లబ్దిదారులయిన బలిజ, కాపు, ఒంటరి మహిళలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్వర్ణాంధ్ర , స్వచ్ఛ ధర్మవరం లక్ష్యంగా ముందుకు సాగుదాం.

-ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధ్యం… -మంత్రి సత్య కుమార్ యాదవ్ ధర్మవరం, నేటి పత్రిక ప్రజావార్త : పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *