మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పనికిరాని పేపర్లు పాత కాగితాలు పాత డిస్పోజల్స్, వినియోగం లేని దాదాపు ఒక టన్ను కొనుగోలుకు సంబంధించి సీల్డ్ టెండర్లను ఆహ్వానించడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి కే.చంద్రశేఖర రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల ఆరవ తేదీ సోమవారం నుండి 16వ తేదీ వరకు జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయ చాంబర్ నందు సీల్డ్ బాక్స్ ఏర్పాటు చేయడం జరిగిందని కార్యాలయ పనిదినాలలో ఇందుకు సంబంధించిన కొటేషన్లను సమర్పించవచ్చునన్నారు. నిర్ణీత గడువు లోగా దాఖలు చేసిన అర్హత గల దరఖాస్తులను పరిశీలించి అత్యధిక కొటేషన్ కోటే చేసిన దరఖాస్తుదారునికి పనికిరాని పేపర్లు, పాత కాగితాలు, పాత డిస్పోసల్స్ కొనుగోలు చేసుకునేందుకు అర్హతగా పరిగణించడం జరుగుతుందని డిఆర్ఓ కే. చంద్రశేఖర రావు ఆ ప్రకటనలో తెలిపారు.
Tags machilipatnam
Check Also
ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ
-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …
Prajavartha Online Telugu News