Breaking News

క్షేత్ర స్థాయిలో అర్జీలు పరిష్కారం కోసం మండల, డివిజన్ పరిధిలో పిజిఆర్ఎస్ ఏర్పాటు

-తొలిసారిగా నల్లజర్ల మండలం పిజిఆర్ఎస్ కు హజరు కావడం జరిగింది
-కలెక్టరు పి ప్రశాంతి

నల్లజర్ల, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యలు పరిష్కారం కోసం మండల కేంద్రంలో ఉన్న అధికారులకి అర్జీలను అందచేయాలని, వాటికీ జవాబుదారీతనం కలిగి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు.

సోమవారం స్థానిక నల్లజర్ల ఎంపిడివో కార్యాలయంలో పీజీఆర్ఎస్ కు కలెక్టర్ హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, మండల కేంద్రంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రతీ సోమవారం కలెక్టరేట్ లో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కి ఎక్కువ మంది రావడం, మండల స్థాయిలో పరిష్కారం లభించే వాటి మీద రాజమహేంద్రవరం రావడం జరుగుతోందని పేర్కొన్నారు.

మండల స్థాయి అధికారులకు ప్రజలు తహసిల్దార్ లేదా ఎంపిడివో కార్యాలయాలకు వొచ్చి అర్జీలను అందించాల్సి ఉంటుందన్నారు. మండలస్థాయి అధికారులు అందరూ ఒక్క చోట ప్రజలకి అందుబాటులో ఉండి అర్జీలు పరిష్కారం చెయ్యాల్సి ఉందన్నారు. ఈరోజు మొత్తం 47 అర్జీలను స్వీకరించడం జరిగిందనీ తెలిపారు. వాటిలో రెవిన్యూ 24 ,సర్వే & ల్యాండ్ రికార్డ్స్ 7 , జాతీయ రహదారులు  ఒకటీ , ఆర్ అండ్ బి 2 , సాంఘిక సంక్షేమం ఒకటి, పంచాయత్ రాజ్ 9 ,  పోలీసు 2 , నీటిపారుదల ఒకటి చొప్పున అర్జీలను స్వీకరించడం జరిగింది .

స్వీకరించిన కొన్ని అర్జీలు:

నల్లజర్ల గ్రామానికీ కి చెందిన కూచిపూడి వెంకటరత్నం ఆర్ ఎస్ నం. 114 నుంచి ఆర్ ఎస్ నేం.759 కి సంబంధించి రహదారి మార్గం సమస్య పరిష్కారం కోసం అర్జీ ఇవ్వడం జరిగింది.

నల్లజర్ల గ్రామానికీ కి చెందిన శనగన సత్యనారాయణ తండ్రి ఆస్తి, కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి పంపకాలు విషయమై కలెక్టరు కి అర్జీ అందచేశారు.

ఈ కార్యక్రమంలో నల్లజర్ల తహశీల్దార్ ఎస్ వి ఎస్ నాయుడు, ఎంపిడివో పి. సింహాద్రి, ఎంపిపి బి. జయలక్ష్మి, డివిజనల్ అభివృద్ది అధికారి ఏ. స్లేవా రెడ్డీ, ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *