విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
APJAC అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తిమ్మసర్తి నాగేశ్వరరావు మరియు APMESA VMC యూనిట్ అధ్యక్షులు శ్యామ్ సుందర బాబు ఇతర కార్యవర్గ సభ్యులు నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం, ఐ.ఏ.యస్ ని గౌరవార్ధం కలవడం జరిగింది. సదరు కార్యక్రమములో APMESA VMC యూనిట్ క్యాలెండర్ ను కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం, ఐ.ఏ.యస్., చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భములో ఒకే క్యాడర్ లో ఉద్యోగులు పదోన్నతులు లేకుండా పనిచేస్తున్నారని వారికి పదోన్నతులు కల్పించాలని మరియు ఉద్యోగులు విధి నిర్వహణలో ఎదుర్కుంటున్న పలు సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకుని రాగా, కమీషనర్ సానుకూలముగా స్పందించి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమములో ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ కె. శివరామ ప్రసాద్, స్టేట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు G.శ్రీకృష్ణ దేవరాయలు, VMC యూనిట్ జనరల్ సెక్రెటరి సలీం అహ్మద్, ఉపాధ్యక్షులు SK.రాంబాబు, అసోసియేట్ ప్రెసిడెంట్ గుర్రం ప్రకాష్ సాగర్, ఆర్గనైజింగ్ సెక్రెటరి కె. సురేంద్ర కుమార్, పబ్లిసిటీ సెక్రెటరి జ.మారుతీ రావు, ట్రజరర్ బి.ఉదయ భాస్కర్, వైస్ ప్రెసిడెంట్స్ .కె.శారదా రాణి, డి.వెంకటేశ్వర రావు, A. జయప్రభు, S.N మూర్తి, సెక్రెటరీస్ పి. మధుసూదానరావు, శుభకరరావు, K. కరుణ, జాయింట్ సెక్రెటరీస్ SK. అహమ్మద్ అలీ, పి.ఎస్.రాజశేఖర్, వి. భాస్కరరావు, దీపక్ కుమార్, బి.సీత, టి.అరుణ, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ J. షర్మిల, G. పద్మశ్రీ, k. శ్యామ్యూల్, J. దుర్గారావు, S. రవి మరియు విజయవాడ నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News