Breaking News

కుల గణన జాబితాపై సవరణల అర్జీలకు జనవరి 12 వరకు గడువు పెంపు…

-నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ 

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్సీ కుల గణన జాబితాలో సవరణలకు మంగళవారం ఆఖరి రోజు అని గతంలో ప్రకటించామని, ప్రజలకు మరింత గడువు ఇచ్చేందుకు ప్రభుత్వం జనవరి 12 వరకు పొడిగించిందని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పూర్తి అయిన కుల గణన జాబితాలను 2024 డిశంబర్ 26న నగరంలోని 206 వార్డ్ సచివాలయాల నోటీసు బోర్డ్ ల్లో సందర్శనార్ధం ప్రకటీంచామని తెలిపారు. నగర ప్రజలు సర్వే రిపోర్ట్ లోని తమ వివరాలు సరిగా ఉన్నాయో, లేదో చెక్ చేసుకోవచ్చని తెలిపారు. పేర్లు లేదా సబ్ కేటగిరి వివరాలు తప్పుగా ఉన్నా లేదా ఏమైనా అభ్యంతరాలు ఉన్నా జనవరి 12వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు స్థానిక సచివాలయంలో అడ్మిన్ కార్యదర్శి, విఆర్ఓలకు లిఖిత పూర్వకంగా అర్జీలు అందించవచ్చని తెలిపారు. ఆర్జీలను క్షేత్ర స్థాయిలో విచారించి, విచారణ మేరకు తుది జాబితాలో నమోదు చేస్తామని పేర్కొన్నారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, జాబితాలో తమ వివరాలను సమగ్రంగా ఉండేలా చూసుకోవచ్చని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *