Breaking News

ప్రజలకు ఎటువంటి సమస్య రాకుండా ప్రణాళిక

-సి డి ఎం ఏ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు ఎటువంటి సమస్య రాకుండా ముందస్తు ప్రణాళికతో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం నాడు ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీ.డీ.ఎమ్.ఏ వారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ కాన్ఫరెన్స్లో ఏ బి సి ఆపరేషన్లు, పాట్ హోల్ రేపైర్స్, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, అన్న క్యాంటీన్ నిర్వహణ, త్రాగునీటి సరఫరా తదితర అంశాలపై చర్చించారు. ప్రజలకు ఎటువంటి సమస్య రాకుండా ముందుగానే ప్రణాళికలతో ఉండేటట్టు అధికారులను సూచించారు.

ఈ కాన్ఫరెన్స్ లో అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) డాక్టర్ డి.చంద్రశేఖర్, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి సృజన, ఇంచార్జ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సుప్రింటెంటింగ్ ఇంజనీర్ పి సత్యనారాయణ, ఇంచార్జ్ వెహికల్ డిపో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏసు పాదం, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి ఎస్ ఎస్ రెడ్డి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *