Breaking News

ఎడిబి రహదారి పనుల ను క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసిన కలెక్టరు, జెసి

-భూసేకరణ భూముల ఆక్రమణల తొలగింపు పై ప్రత్యేక దృష్టి పెట్టాలి
-కలెక్టరు ప్రశాంతి

రాజానగరం / రంగంపేట, నేటి పత్రిక ప్రజావార్త :
కాకినాడ – రాజానగరం ప్రధాన రహదారి మార్గంలో ఏపి రహదారుల అభివృద్ది కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు నిధులతో చేపట్టిన పనులు పూర్తి చెయ్యడం లో మరింత సమర్థవంతంగా పనితీరు చూపాల్సి ఉంటుందనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. బుధవారం కలక్టరేట్ నుంచి బయలుదేరి రాజానగరం, రంగంపేట మండలాల పరిధిలో ఏ డి బి రహదారి పనులను , భూసేకరణ విషయంలో క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తో కలిసి ఆకస్మికంగా కలెక్టరు తనిఖీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, కాకినాడ – తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ప్రధానమైన రహదారి మార్గం ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకుని రావాల్సి ఉందన్నారు. ప్రభుత్వ భూములలో ఆక్రమణలకు గురి అయిన వాటిని గుర్తించి, అక్కడి నుంచి వారిని తరలించి, ఆయా నిర్మాణాలను తొలగించే విషయములో హేతుబద్ధత వ్యవహరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఎస్టీ రాజపురం , వడిసలేరు గ్రామాలకు చెందిన భూములను పరిశీలించడం జరిగింది. అనంతరం జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు రంగంపేట, పెద రాయవరం తదితర గ్రామాలకు చెందిన ప్రాంతాల్లో రహదారి మార్గం ను పరిశీలించడం జరిగింది.

ఈ పర్యటన లో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, ఆర్డీవో ఆర్. కృష్ణ నాయక్, ఆర్ డి సి ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీకాంత్, తహసీల్దార్లు లావణ్య, కే. అనసూయ, డిప్యూటి తహసిల్దార్ లు, మండల సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *