Breaking News

సోలార్ పవర్ కార్పోరేషన్ 2025 డైరీ, క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి గొట్టిపాటి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ సోలార్ పవర్ కార్పోరేషన్ 2025 డైరీ, క్యాలెండర్ ను చీఫ్ సెక్రటరీ కే. విజయానంద్ తో కలిసి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సచివాలయంలోని మూడో బ్లాక్ లోని మంత్రి ఛాంబర్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడారు. పునరుత్పాదక రంగానికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగానే ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ని రూపొందించినట్లు పేర్కొన్నారు. గతంలో రాష్ట్రాన్ని విడిచి వెళ్లిన పునరుత్పాదక రంగం పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నట్లు మంత్రి వివరించారు. రాష్ట్రంలో సోలార్ పవర్ కార్పోరేషన్ పనితీరును మంత్రి గొట్టిపాటి అభినందించారు. నాణ్యమైన విద్యుత్ ను అందించడంలో కార్పోరేషన్ కృషి అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎస్ కె.విజయానంద్ , ఏపీ జెన్కో ఎండీ చక్రధర్ బాబు, ట్రాన్స్ కో జేఎండీ కీర్తి చెకూరి, సీపీడీసీఎల్ సీఎండీ పఠాన్ శెట్టి రవి సుభాష్, సోలార్ పవర్ కార్పోరేషన్ ఎండీ కమలాకర్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *